ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
బినామీ కంపెనీల పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారని పట్టాభి ఆరోపించారు.అంతేకాకుండా జగన్ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కాకుండా దోచుకో పంచుకో తినుకో స్కీమ్ ను అమలు చేస్తున్నారన్నారు.







