CM Jagan : ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం జగన్..!!

ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం జగన్( CM Jagan ) పర్యటించనున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే ఒంగోలు చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.

ఇందులో భాగంగా ఒంగోలులో 22 వేల మందికి సీఎం జగన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు.ఎన్ అగ్రహారంలో పేదలకు ఆయన ఇళ్ల పట్టాలను అందజేస్తారు.

కాగా సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన కన్వేయన్స్ డీడ్లు, ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు.తరువాత అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

అలాగే ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సైతం సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

తాజా వార్తలు