చంద్రబాబు సొంత నియోజకవర్గానికి భారీగా నిధులు విడుదల చేసిన సీఎం జగన్..!!

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గ కుప్పమని అందరికీ తెలుసు.దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఇదే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చంద్రబాబు గెలుస్తూ ఉన్నారు.

 Cm Jagan Has Released Huge Funds To Chandrababu's Own Constituency Chandrababu,-TeluguStop.com

అయితే 2019 ఎన్నికలలో జగన్ గెలిచాక కుప్పంనీ మున్సిపాలిటీగా చేయడం తెలిసిందే.దీంతో స్థానిక మరియు జడ్పీ ఎన్నికలలో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ భారీ ఎత్తున గెలిచింది.

చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే జగన్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవటం అప్పట్లో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇదిలా ఉంటే ఇటీవల సీఎం జగన్ కుప్పం నియోజకవర్గంకి సంబంధించి సొంత పార్టీ కార్యకర్తలతో సమావేశం కావడం జరిగింది.

ఆ సమయంలో పార్టీ కార్యకర్తలు కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి నివేదిక అందించగా రెండు రోజుల్లోనే సీఎం జగన్ 66 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ నిధులు విడుదల చేయడం జరిగింది.ఇదే  సమయంలోనే కుప్పం నియోజకవర్గం కూడా తన సొంత నియోజకవర్గం పులివెందులతో సమానమని జగన్ ఆ నియోజకవర్గ కార్యకర్తలకు తెలియజేసి భరోసా ఇచ్చారు.

Telugu Ap Poltics, Chandrababu, Kuppam, Ys Jagan-Telugu Political News

ఇక ఇదే సమయంలో కుప్పంలో పార్టీ బాధ్యతలు చూసుకుంటున్న భరత్ కి అందరు తోడుగా ఉండాలని వచ్చే ఎన్నికల్లో అతని గెలిపిస్తే కుప్పానికి మంత్రిగా అందిస్తాను అని జగన్ కుప్పం నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలకు మాట ఇచ్చారు.ఏది ఏమైనా చంద్రబాబు సొంత నియోజకవర్గానికి సంబంధించి తాజాగా జగన్ ప్రభుత్వం ₹66 కోట్లు మంజూరు చేయటం సంచలనం రేపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube