నేడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు( AP Budget Sessions ) ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈనెల 18వ తారీకు ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
కాగా నేడు ఏపీ కేబినెట్ సమావేశం కూడా నిర్వహించటం జరిగింది.ఈ సమావేశంలో సరిగ్గా పనిచేయని మంత్రులకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.
ఇక ఈ ఏడాది జులై నుండి విశాఖకు రాజధాని అని సీఎం జగన్ కి( CM Jagan Mohan Reddy ) కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ఈ నెల 3,4 తారీకులలో విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమం జరిగిందన్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.దాదాపు 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది.

అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఏపీ క్యాబినెట్ సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ను( Minister Gudivada Amarnath ) సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు.గ్లోబల్ ఇన్వెస్టర్ సమిత్ సక్సెస్ కావటంపై మెచ్చుకున్నారు.ఈ క్యాబినెట్ బేటిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే 15 బిల్లులకు ఆమోదం తెలపడం జరిగింది.అంతేకాదు 2023-27 పారిశ్రామిక విధానానికి కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.







