సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు.రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.
పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని, మౌళిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.స్కూళ్లు ప్రారంభమై నాలుగు నెలలు అవుతున్నా.
ఇంత వరకు విద్యార్థులకు పుస్తకాలు అందించలేదని మండిపడ్డారు.ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ హాస్టల్స్, జూనియర్ కళాశాలలను సందర్శిస్తానని ఆయన స్పఫ్టం చేశారు.







