కేసీఆర్ సర్కార్ పై సీఎల్పీ నేత భట్టి తీవ్ర విమర్శలు

కేసీఆర్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ప్రాజెక్టులు డిస్ట్రిబ్యూటరీ కాలువలు కూడా తవ్వలేదన్నారు.

చెరువులకు ఉన్న కాలువలను పెంచినా అదనపు భూమి సాగులోకి వచ్చేదని తెలిపారు.నీళ్ల విషయంలో ప్రజలకు కేసీఆర్ సర్కార్ ద్రోహం చేసిందని ఆరోపించారు.

భూస్వామ్య ప్యూడల్ మనస్తత్వంతో ఈనాటి పాలన సాగుతోందని చెప్పారు.పాదయాత్ర పూర్తయిన తరువాత బస్సు యాత్ర చేస్తామని భట్టి స్పష్టం చేశారు.

ఇందులో భాగంగా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులను సందర్శిస్తామని వెల్లడించారు.

Advertisement
2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?

తాజా వార్తలు