ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబులు భేటీ అయ్యారు.రాష్ట్ర వ్యాప్తంగా 50 నియోజకవర్గంలో నిజంగా పోటీ చేస్తారా అని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.
ఓవైసీని అడిగారు.
ఈ మేరకు కచ్చితంగా పోటీ చేస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు.
బీజేపీ పూర్తిగా ఓటు బ్యాంకు పోలరైజ్ చేస్తోందన్న అక్బరుద్దీన్ తమ వర్గానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.అయితే మీరు మీ వర్గానికి అంటే బీజేపీ అజెండా కూడా అదే కదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
దీనిపై అక్బరుద్దీన్ మాట్లాడుతూ ఎవరు ఏమనుకున్నా వచ్చే ఎన్నికల్లో తాము మాత్రం తమ పార్టీని విస్తరిస్తామని తెలిపారు.