యూత్ ఆడియన్స్ లో మంచి ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న నితిన్ కి ఈమధ్య కాలం లో పాపం కాలం అసలు కలిసి రావడం లేదు.భీష్మ తో కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న నితిన్, ఆ తర్వాత విడుదల చేసిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన మార్కెట్ ని దెబ్బ తీసే రేంజ్ లో ఫ్లాప్స్ అయ్యాయి.
వాస్తవానికి మీడియం రేంజ్ హీరోలలో టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను మరియు ఓపెనింగ్స్ ని రాబట్టే సత్తా ఉన్న హీరోలలో ఒకడు నితిన్.కానీ ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా కి రీసెంట్ గా విడుదలైన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్( Extra Ordinary Man )’ చిత్రం చిల్లు పెట్టినట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమాకి అటు ఓపెనింగ్స్ లేవు, ఇటు ఫుల్ రన్ లో వసూళ్లు కూడా లేవు.బయ్యర్స్ కి కనీసం 20 శాతం రికవరీ ని కూడా చెయ్యలేకపోయింది.

మొదటి మూడు రోజులు కలిపి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా నాలుగున్నర కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.నితిన్ గత చిత్రం ‘మాచెర్ల నియోజకవర్గం’ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.ఆ మొదటి రోజు వసూళ్ళలో పావు శాతం కూడా మూడు రోజులకు కలిపి ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్’ చిత్రానికి రాకపోవడం చాలా బాధాకరం.స్టోరీ లైన్ బాగానే ఉన్నప్పటికీ కథలో కావాల్సిన స్క్రీన్ ప్లే లేకపోవడం, టేకింగ్ చాలా నాసిరకంగా ఉండడం, ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం, ఇలాంటివన్నీ ఈ చిత్రం ఈ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణాలుగా మారాయి.
ఈ ఫ్లాప్ తర్వాత నితిన్ ‘ఇష్క్‘ కి ముందు ఎలాంటి ఫ్లాప్స్ తో ఉండేవాడో, ఆయన మార్కెట్ ఏ రేంజ్ లో డౌన్ అయ్యిందో, మళ్ళీ అదే రేంజ్ లో డౌన్ అవుతాడేమో అని ఆయన ఫ్యాన్స్ భయపడుతున్నారు.

ఇక నితిన్ ఆశలన్నీ ప్రస్తుతం వెంకీ కుడుముల( Venky Kudumula ) తో చేస్తున్న చిత్రం పైనే ఉందని తెలుస్తుంది.ఈ సినిమానే మళ్ళీ ఆయన్ని బౌన్స్ బ్యాక్ అయ్యేలా చెయ్యాలి.లేకపోతే నితిన్( Nithiin) కెరీర్ కొనసాగడం కష్టమే.
స్క్రిప్ట్ సెలక్షన్ లో ఆయన గుడ్డిగా నమ్మడం మానేయాలి.ఈ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్’ చిత్రాన్ని ఆడియన్స్ కనీసం రెండు గంటలు కూడా చూడలేకపోయారు.
ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుందా, ఎప్పుడెప్పుడు థియేటర్ నుండి పరుగులు తీద్దామా అనే ఫీలింగ్ ని కలిగించింది.గత దశాబ్ద కాలం లో నితిన్ నుండి ఇలాంటి చెత్త సినిమా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.