వంటగది శుభ్రం చేయటానికి కొన్ని చిట్కాలు

కిచెన్ ప్లాట్ ఫామ్ బాగా జిడ్డు పట్టినప్పుడు శుభ్రం చేయటానికి రసాయనాలతో కూడిన క్లినింగ్ లిక్విడ్ లను ఉపయోగించకూడదు.

ఒక కప్పు వైట్ వెనిగర్ తీసుకోని దానిలో ఒక మెత్తని వస్త్రాన్ని ముంచి తుడవాలి.

వెనిగర్ సహజసిద్దమైనది కాబట్టి ఎటువంటి ప్రమాదం ఉండదు.ఒకవేళ రసాయనాలు ఆహారంలో కలిస్తే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

సింక్ పైపుల్లో నీరు నిలిచిపోతుంటే .ఒక కప్పు వెనిగర్ లో ఒక కప్పు బేకింగ్ సోడా కలిపి డ్రైన్ లో పోయాలి.నీరు ఎటు పోకుండా కొంతసేపు ఆలా ఉంచితే సింక్ పైపులు శుభ్రపడతాయి.

ఈ విధంగా చేయటం వలన దుర్వాసన కూడా పోతుంది.ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటే.

Advertisement

ఒక కప్పు వెనిగర్ లో ఒక కప్పు నీటిని పోసి కలిపి ఆ మిశ్రమంలో మెత్తని క్లాత్ ముంచి ఫ్రిజ్ ని తుడవాలి.వంటగదిలో ఉన్న చిమ్నీ ఎక్కువగా ఆయిల్‌తో కూడిన జిడ్డు దుమ్ము, దూళితో నిండి ఉంటుంది.

వంటగది చిమ్నీ శుభ్రం చేయటం అనేది కొంచెం కష్టమైన పని.కాబట్టి కొద్దిగా ఉప్పు, వెనిగర్ మరియు బేకింగ్ సోడా వేసి రుద్ది శుభ్రం చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు