Jagityala : ప్రేమ వ్యవహారంలో ఘర్షణ.. జగిత్యాలలో యువకుడి మృతి

ప్రేమ వ్యవహారంలో చెలరేగిన ఘర్షణలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.జగిత్యాల( Jagityala ) జిల్లా మల్యాల మండలం తక్కలపల్లిలో( Takkalapally ) ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

 Clash In Love Affair Death Of A Young Man In Jagityal-TeluguStop.com

ముందుగా మహేశ్ ( Mahesh )అనే యువకుడు యువతి కుటుంబ సభ్యులతో కత్తితో దాడికి పాల్పడ్డాడు.అడ్డుకునే క్రమంలో మహేశ్ పై యువతి బంధువులు బండరాయితో తిరిగి దాడి చేశారు.

దీంతో మహేశ్ అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.అయితే గత మూడేళ్లుగా యువతిని మహేశ్ వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

కాగా మహేశ్ కత్తితో చేసిన దాడిలో ముగ్గురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube