గత కొన్ని రోజుల నుండి మంచు ఫ్యామిలీలో( Manchu family ) గొడవలు జరుగుతున్నాయని జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా మంచు మనోజ్( Manchu manoj ) తన తండ్రి, సోదరుడుతో విభేదాలు పెంచుకొని దూరంగా ఉంటున్నాడని తెలిసింది.
కానీ ఇటీవలే మనోజ్ రెండో పెళ్లిలో మోహన్ బాబు( Mohan babu ) రావటంతో అదంతా పుకారు అని కొందరు కొట్టి పారేశారు.కానీ తాజాగా మనోజ్ పంచుకున్న వీడియో చూస్తే నిజంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది.
ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ ఒక మంచి పేరు సంపాదించుకుంది.
నటుడుగా మోహన్ బాబు ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి అభిమాన హీరోగా మారాడు.వయసు పై పడిన కొద్దీ సహాయ పాత్రలలో కూడా చేశాడు.
రాజకీయపరంగా కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు మోహన్ బాబు.నిజానికి మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు.

మొదట విద్య దేవిని పెళ్లి చేసుకోగా ఆమెకు విష్ణు, లక్ష్మీ పుట్టారు.ఇక విద్యాదేవి మరణించిన తర్వాత ఆమె చెల్లెలు అయిన నిర్మల దేవిని పెళ్లి చేసుకున్నాడు మోహన్ బాబు.ఇక ఆమెకు మనోజ్ పుట్టాడు.ఇక మోహన్ బాబు ముగ్గురు పిల్లలను ఒకేలాగా చూసుకున్నాడు.ఆ ముగ్గురు కూడా ఒకే తల్లికి పుట్టిన వారిలా కలిసి ఉండేది.ఇక మోహన్ బాబు తానే కాకుండా తన వారసులైన మనోజ్, విష్ణు, లక్ష్మీలను కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
కానీ ఈ ముగ్గురు తండ్రికి తగ్గట్టుగా పేరు తెచ్చుకోలేక పోయారు.అంతేకాకుండా తమ హోదాను ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయారు.ఎలాగైనా తండ్రికి తగ్గట్టు కొడుకులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.కానీ ఇప్పటికి వారి కోరిక అలాగే ఉండిపోయింది.
ఇక వీరు మంచి హోదాలో ఉన్నప్పుడు మోహన్ బాబు అందరికీ పెళ్లిళ్లు చేసి అందర్నీ బాగా సెటిల్ అయ్యేలా చేశాడు.

అలా కొంతకాలం బాగున్న వీరి ఫ్యామిలీకి ఏం జరిగిందో తెలియదు కానీ ఫ్యామిలీలో విభేదాలు చోటు చేసుకున్నాయని తెలిసింది.అంతేకాకుండా మనోజ్ తన మొదటి భార్యకు కూడా విడాకులు ఇచ్చాడు.ఆ సమయంలో వారి మధ్య మరింత గొడవలు జరిగాయని తెలిసింది.
దీంతో మనోజ్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఇటీవలే భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఆ పెళ్లి మోహన్ బాబు కి ఇష్టం లేదని చాలా వార్తలు వచ్చాయి.
కానీ మోహన్ బాబు ఆ పెళ్ళికి రావడం వారిని దీవించడంతో అదంతా అబద్ధమని అనుకున్నారు.అయితే విష్ణు మాత్రం ఆ పెళ్లిలో ఎక్కడ కనిపించలేదు.
అసలు పెళ్లికి వచ్చాడా లేదా అనేది కూడా చాలామందికి అనుమానం వచ్చింది.మొత్తానికి పెళ్లి అయ్యాక ఎవరి దారి వాళ్ళు అన్నట్లుగా ఉండగా తాజాగా వారికి సంబంధించిన వీడియో బయటకి రావడంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకాలం లోలోపల జరుగుతున్న మనోజ్, విష్ణు గొడవలు బయటపడ్డాయి.తాజాగా విష్ణు.మనోజ్ మనిషి సారధిని కొట్టినట్లు తెలిసింది.ఇక మనోజ్ ఆ వీడియోను తన ఫేస్బుక్లో పంచుకుంటూ.ఇలా ఇళ్లల్లోకి వచ్చి మా వాళ్లను, బంధువులను కొడుతుంటారండీ.ఇది పరిస్థితి అంటూ మనోజ్ ఆ వీడియోలో పంచుకున్నాడు.
దీంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్ అవ్వగా.ఇంతకాలం మోహన్ బాబు కాపాడుకున్న పరువును గంగలో కలిపేశారు కదా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
మరికొంతమంది విష్ణు పై తప్పు పడుతున్నారు.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.