టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) పాదయాత్ర నంద్యాల జిల్లాలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది.ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పాదయాత్రలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
విషయంలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీకి చెందిన ఏవీ సుబ్బారెడ్డి ( AV Subbareddy )భూమా అఖిలప్రియ వర్గీయుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.సుబ్బారెడ్డి వర్గీయులపై అఖిలప్రియ వర్గం దాడి చేయగా… సుబ్బారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఏవి… దమ్ముంటే డైరెక్ట్ గా రావాలని అఖిల వర్గానికి సవాల్ విసిరారు.జిల్లాలో మొదటి నుండి టీడీపీ( TDP ) పార్టీలో అఖిల వర్సెస్ ఏవి వర్గీయుల మధ్య నువ్వా నేనా అన్న వాతావరణం నెలకొంది.ఈ క్రమంలో లోకేష్ పాదయాత్రలో రెండు వర్గాలకు చెందిన అనుచరులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవటం సంచలనంగా మారింది.పరిస్థితి ఇలా ఉంటే లోకేష్ పాదయాత్ర మంగళవారం శ్రీశైలం నియోజకవర్గంలో ముగించుకుని నంద్యాల నియోజకవర్గంలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
ఈ క్రమంలో కొత్తపల్లి శివార్లలో లోకేష్ కు ఘనస్వాగతం పలికారు.నంద్యాల జిల్లా లోకేష్ పాదయాత్ర మొదటి రోజే గొడవ చేసుకోవడం సంచలనంగా మారింది.







