లేటెస్ట్ బజ్.. ధనుష్ 'సార్' మూవీ రిలీజ్ అవుతుందా లేదా?

విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాందించుకున్న ధనుష్ ఇప్పుడు తెలుగు మార్కెట్ మీద ఫోకస్ పెట్టాడు.

ఇంతకు ముందే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే కానీ ఇప్పుడు వరకు డబ్బింగ్ సినిమాలతోనే ప్రేక్షకులను పరిచయం చేసాడు.

అయితే మొదటిసారి మాత్రం ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నారు.ప్రెసెంట్ ధనుష్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాడు.ఇప్పటికి శేఖర్ కమ్ముల సినిమా కొద్దిగా బ్రేక్ ఇచ్చి అంతకంటే ముందు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసాడు.

సార్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.

Advertisement

బైలింగువల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ధనుష్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా షూట్ పూర్తి అవుతున్న నేపథ్యంలోనే ఇటీవలే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్టు తెలిపారు.

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.దీంతో ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా రాదా అనే సందేహం ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమా అనుకున్న సమయానికి తప్పకుండ వస్తుంది అని తెలుస్తుంది.

మరి దీనిపై మేకర్స్ మరోసారి క్లారిటీ ఇస్తే ఫ్యాన్స్ కు ఉన్న డౌట్స్ అన్ని పోతాయి.ఇక తమిళ్ లో వాతి పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు