మా అధ్యక్షునిగా మరొకసారి కొనసాగిస్తున్న మంచు విష్ణు( Manchu Vishnu ).ప్రస్తుతం ఇదే వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
దీంతో ఇదే విషయం గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు.అంతేకాకుండా ఈ విషయం గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపించడంతో తాజాగా ఈ విషయంపై వైస్ ప్రెసిడెంట్ స్పందించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా మంచు విష్ణునే మరోసారి కొనసాగించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి( Vice President Madala Ravi ) ప్రకటించారు.

2021 లో జరిగిన మా ఎన్నికలలో మంచు విష్ణు మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు.వాస్తవంగా ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన మా అసోసియేషన్ ఎన్నికలు( Maa association elections ) ఈసారి మాత్రం ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించారంటూ వార్తలు వచ్చాయి.అందులో నిజం లేదు అని తాజాగా మాదాల రవి ప్రకటించారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవి కాలం ఇప్పటికే ముగిసిపోయింది.అయినా కూడా విష్ణునే ఇన్నాళ్లు అధ్యక్షుడిగా ఉంటూ వచ్చారు.
మా కు ఎప్పుడో ఎన్నికలు జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల జాప్యం ఏర్పడింది.

మా అసోసియేషన్ ఫండ్ రైజింగ్ కోసం జూలై లో మారిషస్‌లో ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది.ఇదే విషయాన్ని మంచు విష్ణు కూడా గతంలో ప్రకటించారు.ఆ కార్యక్రమం ద్వారా వచ్చే డబ్బును మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం ఉపయోగిస్తామని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యుక్షుడిగా మంచు విష్ణు ఏమైనా స్పందిస్తారేమో చూడాల్సి మరీ.







