దుండగులకు టార్గెట్‌గా మారిన ఓ భారతీయ చిత్రాన్ని కెనడియన్ మల్టీప్లెక్స్ చైన్ ‘‘సినీప్లెక్స్’’( Cineplex ) .థియేటర్ల నుంచి తొలగించింది.
నిరసన, పదే పదే దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.సినీ ప్లెక్స్ ప్రతినిధిని ఉటంకిస్తూ.
తమ నియంత్రణకు మించిన పరిస్థితుల కారణంగా మలయాళ చిత్రం ‘‘ Malaikottai Vaaliban ’’ ప్రదర్శనలను నిలిపివేసినట్లుగా ఏజెన్సీ కెనడియన్ ప్రెస్ కథనాన్ని ప్రసారం చేసింది.గ్రేటర్ టొరంటో ఏరియా( Greater Toronto Area ) (జీటీఏ) పరిధిలోని రిచ్‌మండ్ హిల్, వాఘన్ నగరాల్లోని సినిమా థియేటర్లలో డ్రైవ్ బై షూటింగ్‌పై దర్యాప్తు చేస్తున్నట్లు యార్క్ రీజినల్ పోలీస్ (వైఆర్‌పీ) చెప్పిన ఒకరోజు తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం.

రిచ్‌మండ్ హిల్‌లోని( Richmond Hill ) ఒక థియేటర్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి.కిటికీలు కాల్చినట్లుగా గుర్తించిన తర్వాత పోలీసులు స్పందించారు.అదే రోజున వాఘన్‌లోనూ ఇదే తరహా ఘటన జరిగింది.యార్క్ రీజియన్‌లోని రెండు ఘటనలతో పాటు అదే రాత్రి టొరంటో, పీల్ రీజియన్‌లోని సినిమా హాళ్లలో జరిగిన కాల్పుల ఘటనతో నిందితులకు సంబంధం వుందని మల్టీప్లెక్స్ సంస్థ పేర్కొంది.
ఆ రెండు థియేటర్లు బ్రాంప్టన్, స్కార్‌బరో నగరాల్లో వున్నాయి.ఈ ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలు లేదా వ్యక్తుల గురించి తెలిస్తే తక్షణం సమాచారం అందించాల్సిందిగా పోలీసులు ప్రజలను కోరారు.

ఒక భారతీయ సినిమా ప్రదర్శనకు కెనడాలో అంతరాయం కలగడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి.డిసెంబర్ 5న జీటీఏలోని మూడు వేర్వేరు థియేటర్లలో ప్రదర్శితమవుతున్న హిందీ చిత్రాన్ని నిరసిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు ప్రమాదకర రసాయనాన్ని స్ప్రే చేయడంతో ప్రేక్షకులు హాల్ నుంచి బయటకు పరుగులు తీశారు.టొరంటో, వాన్, బ్రాంప్టన్‌లలోని మల్టీప్లెక్స్‌లలో ఈ ఘటనలు జరిగాయి.కెమికల్ స్ప్రే ప్రభావానికి గురి కావడంతో కొందరు ప్రేక్షకులు దగ్గుతో బాధపడ్డారు.తక్షణం 200 మందిని థియేటర్ నుంచి ఖాళీ చేయించారు అధికారులు.అయితే ఎవరూ ఎలాంటి తీవ్రమైన అస్వస్థతకు గురికాలేదని పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.దీని వెనుక ఎవరు వున్నారు.? ఎవరి కుట్ర అనేది త్వరలోనే తేలిపోనుంది.