ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొలది ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులోకి రావడం జరిగింది.
ఇదే సమయంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.పరిస్థితి ఇలా ఉంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో( Skill Development Case ) కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ కేసులో అచ్చెన్నాయుడిని( Atchannaidu ) సీఐడీ ఏ38గా చేర్చడం జరిగింది.దీంతో ముందస్తు బెయిల్ కోసం అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు.
బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది.ఇక ఇదే కేసుకు సంబంధించి చంద్రబాబు( Chandrababu ) బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ(
CID ) వేసిన పిటీషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ కి వాయిదా వేయడం జరిగింది.
గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు.రాజమండ్రి సెంట్రల్ జైలులో( Rajahmundry Central Jail ) 53 రోజులపాటు ఉన్నారు.అక్టోబర్ నెల ఆఖరిలో బెయిల్ రావడం జరిగింది.ఇదిలా ఉంటే సరిగ్గా ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఈ కేసులో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరు చేర్చడం సంచలనంగా మారింది.2024 ఎన్నికలను చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా పొత్తులు కూడా పెట్టుకోవడం జరిగింది.అయితే సరిగ్గా ఎన్నికలు సమయానికి స్కిల్ డెవలప్మెంట్ కేసు…టీడీపీ పార్టీకి కీలక నేతలను వెంటాడటం సంచలనంగా మారింది.