అమరావతి భూముల కేసులో సీఐడీ దూకుడు పెంచింది.రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబు అరెస్ట్ చేసినట్లు సమాచారం.1100 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహరంలో అక్రమాలు జరిగాయని అభియోగాలు వచ్చిన విషయం తెలిసిందే.రామకృష్ణ హౌసింగ్ కంపెనీ, మాజీమంత్రి నారాయణల మధ్య రూ.15 కోట్ల లావాదేవీలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు.







