అమెరికా గూఢచార సంస్థ ‘‘సీఐఏ’’లో కొత్త పోస్ట్.. తొలి అధికారి మన భారతీయుడే..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు అక్కడ తమ ప్రతిభా పాటవాలతో అసాధారణ విజయాలు సాధిస్తున్నారు.అగ్రరాజ్యంలోని ఏ రంగంలో చూసినా ఇప్పుడు మనవారి ఆధిపత్యం కనిపిస్తుంది.

 Indian-american Entrepreneur Appointed First-ever Cto Of Cia, Nand Mulchandani A-TeluguStop.com

అంతేకాదు ఏకంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్.భారత సంతతి వ్యక్తి కావడం మనందరికీ గర్వకారణం.

తాజాగా అమెరికా గూఢచార సంస్థ ‘‘సీఐఏ’’లో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి దక్కింది.

ప్రపంచంలోని గూఢచార సంస్థల్లో ప్రముఖమైనదిగా గుర్తింపు తెచ్చుకున్న యూఎస్ సీఐఏలో భారత సంతతికి చెందిన నంద్ ముల్చందానీ ఈ ఏజెన్సీలో కొత్తగా ఏర్పాటు చేసిన చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)గా నియమించారు.

ఈ మేరకు సీఐఏ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.నంద్‌కు సిలికాన్ వ్యాలీలో, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో 25 ఏళ్లకు పైగా అనుభవం వుంది.సీఐఏని మరింత పటిష్టపరిచే ఉద్దేశంతో ప్రభుత్వ, ప్రైవేట్, స్టార్ట్ అప్ నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటామని ఏజెన్సీ తెలిపింది.

సీటీవో హోదాలో ఆయన సీఐఏ మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాల్సి వుంటుంది.

ఇందుకోసం అత్యాధునిక ఆవిష్కరణలను ఆయన పరిశీలించాల్సి వుంటుంది.నంద్ నియామకంపై సీఐఏ డైరెక్టర్ విలియం జె.బర్న్స్ స్పందించారు.మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా సాంకేతికతకు తాను ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.

నంద్ తమ బృందంలో చేరినందుకు సంతోషంగా వుందని… ఈ కొత్త పాత్రకు అతని అనుభవం సాయపడుతుందని బర్న్స్ ఆకాంక్షించారు.

సీఐఏలో చేరడానికి ముందు.

ముల్చాందానీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో జాయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్‌కు యాక్టింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు.అంతేకాదు.

అనేక విజయవంతమైన స్టార్టప్‌లకు సహ వ్యవస్థాపకుడిగా, సీఈవోగానూ వ్యవహరించారు.కార్నెల్ , స్టాన్‌ఫోర్డ్ , హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో నంద్ చదువుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube