ప్రతి మనిషి యొక్క స్వభావం వారు పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రం,నక్షత్రాన్ని బట్టి రాశి, రాశిని బట్టి జాతకాన్ని చూసి తెలుసుకుంటారు.రాశి,నక్షత్రమును బట్టి మనస్తత్వాలు మారిపోతూ ఉంటాయి.
ఆడవారి మనస్తత్వం ఒక పట్టాన అర్ధం కాదు.అయితే వారు పుట్టిన నక్షత్రాన్ని బట్టి రాశి తెలుసుకొని జాతకాన్ని తెలుసుకోవచ్చు.
ఇప్పుడు చెప్పబోయే నక్షత్రం కాస్త స్పెషల్ అని చెప్పాలి.చిత్తా నక్షత్రంనకు అధిపతి కుజుడు.వీరు తాము చెప్పిందే కరెక్ట్ అని వాదిస్తూ ఉంటారు.అలాగే ఈ నక్షత్రం వారు ఇతరుల నుండి సాయాన్ని తీసుకుంటారు.
కానీ ఇతరులకు సాయం చేయాలంటే మాత్రం ముందుకు రారు.
ఈ నక్షత్రంలో పుట్టినవారు ప్రయోజనం లేని చర్చలు,కోపతాపాలు వీరి స్వభావం.
అనవసరమైన కోపం వలన లేనిపోని నష్టాలు, కష్టాలను తెచ్చుకుంటారు.స్థిరాస్థులు వంశపారంపర్యంగా వస్తాయి.
సొంతంగా కూడా ఆస్తులను కూడబెడతారు.
వీరు భాగస్వాముల సహకారం ఉంటేనే జీవితంలో రాణిస్తారు.
వీరు రాజకీయరంగంలో బాగా రాణిస్తారు.ఎవరైనా తప్పు చేస్తే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా దైర్యంగా ముందుకు సాగుతారు.
చిత్త నక్షత్రంలో పుట్టిన ఆడవారు మధ్య వయస్సు వరకు జీవితాన్ని ఎంత ఎంజాయ్ చేయాలో అంతా ఎంజాయ్ చేస్తారు.ఆ తర్వాత సాదా జీవితాన్ని అనుభవిస్తారు.వీరు ఇతరులను ప్రేమిస్తారు.వీరు చాలా అందంగా ఉంటారు.
ఉన్నత పదవులను అలంకరిస్తారు.అంతేకాక వీరికి ఆధిపత్యం అంటే చాలా ఇష్టం.
వీరికి చాలా పెద్ద బలహీనత ఉంది.ఇతరులు ఏమి చెప్పిన వెంటనే నమ్మేస్తారు.వీరు 2018 లో స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు.వీరు అమ్మవారిని ఎక్కువగా పూజిస్తే మంచిది.