కెరీర్ ఆరంభంలో కాస్త పర్వాలేదు అన్నట్లుగా సక్సెస్‌లు దక్కించుకున్న సాయి ధరమ్ తేజ్ గత రెండు సంవత్సరాలుగా ఒక్క సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు.వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
ఏ హీరో అయినా వరుసగా అరడజను సినిమాలు ఫ్లాప్ అయితే నెగ్గుకు రావడం కష్టం.కాని మెగా కాంపౌండ్ నుండి ప్రోత్సాహం ఉన్న కారణంగా మనోడికి ఈ అవకాశం వచ్చింది.మరి ఈ చిత్రంతో అయినా మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు సక్సెస్ దక్కిందా అనేది ఈ విశ్లేషణలో చూద్దామా…
నటీనటులు: సాయి తేజ్, కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్, సునీల్, పోసాని, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాణం: మైత్రి మూవీస్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కథ:
చిన్నప్పటి నుండి కూడా విజయ్(సాయి తేజ్) ఏ పని చేసినా కూడా అది సరిగా కలిసి రాదు.దాంతో తనకు తాను దురదృష్టవంతుడిగా ఫీల్ అవుతూ ఉంటాడు, తనకు సక్సెస్ అనేది దక్కదని నిర్ణయించుకుంటాడు.ఏదోలా ఒక కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు.అయితే ఆ జాబ్‌లో జాయిన్ అయినప్పటి నుండి అతడి కష్టాలు మరింత పెరుగుతాయి.ఆ కష్టాలు ఏంటీ? ఇంతకు ఇద్దరు హీరోయిన్స్‌లో విజయ్ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోండి.
నటీనటుల నటన:
సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంలో కొత్త లుక్‌లో కనిపించాడు.కాస్త ఎక్కువ గడ్డంతో పాటు, మునుపటి చిత్రాలతో పోల్చితే కాస్త బరువు తగ్గినట్లుగా కూడా అనిపించాడు.కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో మినహా మిగిలిన అన్ని సీన్స్‌లో కూడా తేజూ కొత్తదనం చూపించలేక పోయాడు.
మూసగా, గత చిత్రాల్లో మాదిరిగానే నటించాడు.ఇక హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శి చూడ్డానికి బాగున్నా కూడా నటన పరంగా మాత్రం ఆమె చాలా మార్పు చెందాల్సిన అవసరం ఉంది.
ఇక నివేదా పేతురాజ్ కన్నింగ్ పాత్రలో కనిపించి మెప్పించింది.ఒక మంచి తండ్రి పాత్రను పోసాని పోషించి మెప్పించాడు.
సునీల్ చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ పాత్రను దక్కించుకున్నాడు.అయితే కామెడీతో అంతంత మాత్రంగానే ఆకట్టుకున్నాడు.
వెన్నెల కిషోర్ ఉన్నది కొద్ది సమయం అయినా కూడా ఆకట్టుకున్నాడు.ఇతరులు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.
టెక్నికల్:
దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగుంది.రెండు మూడు పాటలు శ్రోతలను ఆకట్టుకోవడంతో పాటు మంచి చిత్రీకరణ వల్ల హైలైట్ అయ్యాయి.ఇక సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చింది.కొన్ని ఎమోషన్ సీన్స్‌ను మరింత ఎమోషన్‌గా మార్చడంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలకంగా వ్యవహరించింది.సినిమాటోగ్రఫీ బాగుంది.పలు సీన్స్ చాలా సహజంగా వచ్చాయి.
ఇక పలు సీన్స్‌ను సాగతీసినట్లుగా ఉన్నాయి.వాటిని మరింత ఎడిట్ చేస్తే బాగుండేది.
దర్శకుడు ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.ఎమోషన్ సీన్స్ బాగా చేశాడు.
నిర్మాణాత్మక విలువుల బాగున్నాయి.
విశ్లేషణ:
వరుస పరాజయాల్లో ఉన్న తేజ్‌కు ఇది కాస్త బూస్ట్ ఇచ్చే సినిమాగా చెప్పుకోవచ్చు.సినిమాపై అంచనాలు భారీగా వచ్చాయి.అంచనాలను అందుకున్నట్లుగా ఈ చిత్రం ఉంది.ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌ను అలరించడం ఖాయంగా కనిపిస్తుంది.పూర్తి స్థాయి పక్కా కమర్షియల్‌గా మాత్రం ఈ చిత్రం లేదని చెప్పుకోవచ్చు.
ఎంటర్‌టైన్‌మెంట్ సీన్స్ డోస్ ఇంకాస్త పెంచి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.మొత్తానికి సాయి ధరమ్ తేజ్ పరాజయాల పరంపరకు ఈ చిత్రం బ్రేక్ వేస్తుందా అనేది సినిమాకు ప్రేక్షకుల నుండి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి తెలిసి పోతుంది.
ఒక విశ్లేషకుడిగా మాత్రం నాకు ‘చిత్రలహరి’ పర్వాలేదు, ఒకసారి చూడదగ్గ మూవీ అనిపించింది.
ప్లస్ పాయింట్స్:
సాయి ధరమ్ తేజ్, కొన్ని కామెడీ సీన్స్, సంగీతం
మైనస్ పాయింట్స్:
ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే.
రేటింగ్ : 2.5/5
బోటం లైన్ : మెగా అభిమానులను మెప్పించే ‘చిత్రలహరి’
.