తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట అందాల రాక్షసి సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న హను రాఘవపూడి కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇటీవల విడుదల అయినా సీతారామం సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమాతో భారీగా పాపులర్ అయ్యాడు హను రాఘవపూడి.
ఇది ఇలా ఉంటే తాజాగా చెప్పాలని ఉంది అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో ఎన్నో విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా మొదటిసారి ఎలా అవకాశం వచ్చింది అన్న ప్రశ్నపై స్పందిస్తూ.మొదట చదువుకోవడానికి హైదరాబాద్ కు వచ్చాక జూబ్లీహిల్స్ సినిమా వాళ్ళు ఉంటారని తెలిసి ఒకరోజు బండిమీద జూబ్లీహిల్స్ కి వెళ్లాను.
అప్పుడు అమృతం సీరియల్ షూటింగ్ జరుగుతోంది.ఆ సమయంలో డైరెక్ట్ గా చందు ని కలిసి నేను డైరెక్షన్ వైపు రావాలనుకుంటున్నాను అని అడగడంతో, అతను నా కాలేజి స్కూల్ మార్క్స్ చూసి ఎందుకు ఇటువైపు రావడం అంత బాగా చదువుతున్నావు హాయిగా ఉద్యోగం చేసుకో అని సలహా ఇచ్చారు కానీ మూడు రోజుల వరుసగా వెళ్లడంతో నా ఆసక్తిని చూసి అవకాశం ఇచ్చారు.

అప్పుడు ఐతే అనే సినిమాకు పని చేశాను.ఆ సమయంలో చదువు మానేసి సినిమా వైపు వెళ్ళినందుకు మా ఇంట్లో వాళ్ళు దాదాపు ఆరు నెలలు నాతో మాట్లాడలేదు అని చెప్పుకొచ్చారు హను రాఘవపూడి.అనంతరం బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయట నిజమేనా భవిష్యత్తులో ఎటువంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించగా ఆ కృష్ణ పై స్పందించిన హను రాఘవపూడి.అవునండి అవకాశాలు వచ్చాయి.
కానీ నేను ప్రస్తుతం తెలుగు సినిమాలు మాత్రమే తీయాలి అని అనుకుంటున్నాను.భవిష్యత్తులో రానున్న సినిమాలు సీతారామన్ సినిమాను మించి ఉంటాయి అని చెప్పు కొచ్చారు హను రాఘవపూడి.







