అతడిపై చిరు, పవన్‌లు ఫోకస్‌

Chiru And Pawan Focus On Sai Dharam Tej

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌ ఆశించిన స్థాయిలో లేదని చెప్పక తప్పదు.మెగా ఫ్యాన్స్‌ ఈయనపై చాలా నమ్మకం పెట్టుకుని సుప్రీం హీరో అంటూ పిలిచేసుకుంటున్నారు.

 Chiru And Pawan Focus On Sai Dharam Tej-TeluguStop.com

కాని తేజ్‌ మాత్రం రెండు సంవత్సరాలుగా సక్సెస్‌ కోసం మొహం వాచేలా ఎదురు చూస్తున్నాడు.ఈయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్‌ ముందు బొక్కబోర్లా పడుతూ వస్తుంది.

అయినా నిరుత్సాహపడకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.తాజాగా కూడా ఈయన ‘తేజ్‌’ చిత్రాన్ని చేస్తున్నాడు.

అంతకు ముందు ఇంటిలిజెంట్‌ చిత్రాన్ని చేశాడు.విన్నర్‌, జవాన్‌ ఇలా అన్ని కూడా బ్లాక్‌ బస్టర్‌ ఫ్లాప్‌ుగా మిగిలి పోయాయి.

దాంతో మెగాస్టార్‌ చిరంజీవి మరియు పవన్‌ కళ్యాణ్‌లు మేనల్లుడి కెరీర్‌పై ఫోకస్‌ పెట్టారు.

సోదరి కొడుకు కెరీర్‌ను నిబెట్టలేక పోతే ఇంత క్రేజ్‌ ఉండి ఎందుకు అనుకున్నారో ఏమో కాని ఇద్దరు కూడా తమకు తోచిన సాయంను చేసేందుకు ముందుకు వచ్చారు.చిరంజీవి స్వయంగా అల్లు అరవింద్‌తో మాట్లాడి తేజ్‌ కోసం ఒక చిత్రం చేయాల్సిందిగా కోరాడట.అల్లు అరవింద్‌ బ్యానర్‌లో సినిమా అంటే మినిమం సక్సెస్‌ గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం తేజ్‌ కోసం ఒక యువ దర్శకుడితో కథను సిద్దం చేయిస్తున్నాడు.తేజ్‌ పూర్తి అయిన తర్వాత అల్లు అరవింద్‌ బ్యానర్‌లో సినిమా ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది.

గీతాఆర్ట్స్‌లో సినిమా చేసే అవకాశం రావడం యంగ్‌ హీరోలకు పెద్ద లక్కీ ఛాన్స్‌గా చెప్పుకుంటారు.

ఆ ఛాన్స్‌ సాయి ధరమ్‌ తేజ్‌కు రెండవ సారి దక్కబోతుంది.

పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో ఇప్పటికే ఒకసారి ఆ బ్యానర్‌లో నటించిన తేజూ మరోసారి ఆ బ్యానర్‌లో నటించి సక్సెస్‌ను దక్కించుకోబోతున్నాడు.మరో వైపు పవన్‌ కళ్యాణ్‌ కూడా తనకున్న పరిచయాలతో తేజ్‌కు మంచి కెరీర్‌ను, సక్సెస్‌ను ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మెగా ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు.

వీరిద్దరి సాయంతో అయినా తేజ్‌ ఈ సంవత్సరం సక్సెస్‌ను దక్కించుకుంటాడేమో చూడాలి.

కరుణాకరన్‌ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘తేజ్‌ ఐలవ్‌యు’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది.

ఆ వెంటనే కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమాకు ఈమెగా హీరో కమిట్‌ అయ్యాడు.వరుసగా సినిమాలు అయితే చేస్తున్నాడు కాని, సక్సెస్‌లను మాత్రం దక్కించుకోవడం లేదు అంటూ సినీ వర్గాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మేనమామల హ్యాండ్‌ పడటంతో అయినా తేజ్‌ ఫేట్‌ మారుతుందేమో చూడాలి.ఈ సంవత్సరంలో తేజ్‌ రెండు లేదా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఆ సినిమాల ఫలితాలు ఆయన కెరీర్‌ను నిర్ణయిస్తాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube