టాలీవుడ్ లో దసరా సందడి మొదలయ్యింది.ఈ ఏడాది టాలీవుడ్ నుండి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల్లో మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ కూడా ఉంది.
రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ శరవేగంగా జరుగు తున్నాయి.ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు, కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తుండగా.
థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించినట్టు టాక్.
ఈమె సత్యదేవ్ భార్య పాత్రలో కీలక మైన పాత్రలో నటించింది.అలాగే తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.
ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రొమోషన్స్ లో మెగాస్టార్ కూడా పాల్గొంటూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు.
ఈ క్రమంలోనే చిరు ఆచార్య సినిమాపై కొన్ని కామెంట్స్ చేసాడు.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ ప్లాప్ ఎదుర్కున్న విషయం తెలిసిందే.ఈ డిజాస్టర్ పై తాజాగా మెగాస్టార్ నోరు విప్పారు.ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.
చిరు అనుపమ చోప్రాతో జరిగిన ఇంటర్వ్యూలో ఆచార్య సినిమాలో తాను, రామ్ చరణ్ శివ కోరుకున్నట్లు చేశామని అయినా ఈయన సినిమా మునిగిపోకుండా కాపాడలేక పోయారని తెలిపారు.అయితే ఈయన వ్యాఖ్యలు బయటకు రావడంతో కొరటాల శివను సపోర్ట్ చేసే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ విషయంపై కొరటాల స్పందించి తీరాలని అడుగుతున్నారు.మరి ఈయన వీరి మాటలను లెక్క చేస్తాడో లేదో చూడాలి.