మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా లు ఈ సంక్రాంతి కి ఒక్క రోజు తేడాతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న విషయం తెలిసిందే.ఈ రెండు సినిమా లు కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడం తో మరింత ఆసక్తికరంగా పరిస్థితి మారింది.
రెండు సినిమాలు కూడా వారికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమా లను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు రూ.100 కోట్ల కు పైబడిన బడ్జెట్ తోనే రూపొందించారు.మెగాస్టార్ చిరంజీవి సినిమా కు ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ ని కేటాయించగా వీర సింహారెడ్డి సినిమా కోసం 120 నుండి 130 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని ప్రచారం జరుగుతుంది.గతం లో చిరంజీవి మరియు బాలకృష్ణ లు కలిసి సంక్రాంతి కి బాక్సాఫీస్ వద్ద పలు సందర్భాల్లో పోటీ పడ్డారు.
కానీ ఈసారి మాత్రం వారి వారి 100 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలతో పోటీ పడుతుండడం చాలా ప్రత్యేకమైన విషయం అనడం లో సందేహం లేదు.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో రూపొందడం వల్ల 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడితేనే నిర్మాతలకు లాభాలు దక్కినట్లు.కనుక ఈ రెండు సినిమా లు 100 కోట్లు రాబడుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.ఒక్క రోజు తేడాతో రాబోతున్న రెండు పెద్ద సినిమాలు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం అంటే చాలా పెద్ద విషయం, మరి ఈ రెండు సినిమాలు ఆ యొక్క రికార్డును సొంతం చేసుకుని మైత్రి మూవీ మేకర్స్ వారికి లాభాలను రాబట్టేనా చూడాలి.
ఈ రెండు సినిమా లకు మైత్రి మూవీ మేకర్స్ వారు ఎలా అయితే నిర్మాతలుగా వ్యవహరించారో.ఈ రెండు సినిమా లకు శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.
ఈ రెండు సినిమా లు చాలా ప్రత్యేకమైన సినిమా లు గా మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.