కార్తీక్ దండు( Karthik Dandu ) దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ( Saidharam Tej )హీరోగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష.తాజాగా ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది.అంతేకాకుండా చాలా గ్యాప్ తర్వాత వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న సాయి కీ ఈ సినిమా మంచి సక్సెస్ ని తెచ్చి పెట్టింది.
సినిమా మంచి సక్సెస్ ను సాధించిన సందర్భంగా చిత్ర బృందం సంతోషంగా ఉన్నారు.ఈ సందర్బంగా డైరెక్టర్ కార్తీక్ దండును హగ్ చేసుకుని మరీ సాయి తేజ్ ఎమోషనల్ అయ్యాడు.

ఇక ఈక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )కూడా సాయి తేజ్ కు స్పెషల్ విషెష్ చెప్పాడు.ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ సాయి తేజ్ కు చిరు సతీమణి సురేఖ( Surekha ) కేక్ తినిపిస్తున్న ఇమేజ్ ను ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు.అంతే కాదు ఈ స్టిల్ ను పోస్ట్ చేస్తూ ఒక కొటేషన్ ని కూడా రాసుకొచ్చారు చిరంజీవి.విరూపాక్ష సినిమాపై ( movie Virupaksha )వస్తున్న రిపోర్ట్స్ అద్బుతంగా ఉన్నాయి.
ప్రియమైన సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో గ్రాండ్ కమ్ బ్యాక్ ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.ప్రేక్షకులు నీ సినిమాను ప్రశంసిస్తుండటం, సినిమాకు వారి ఆశీస్సులు అందించడం సంతోషంగా ఉంది.

విరూపాక్ష టీమ్ కు నా హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశాడు చిరంజీవి.ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చిరంజీవి ట్వీట్ పై స్పందించిన సాయి ధన్యవాదాలు తెలిపారు.థ్యాంక్స్ అత్తా మామ అంటూ రీట్వీట్ చేశాడు సాయిధరమ్ తేజ్.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ తర్వాత వచ్చిన మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అయితే సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు టెన్షన్ పడినప్పటికీ సినిమా సక్సెస్ కావడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన విరూపాక్ష మిస్టరీ, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగుతూ మంచి టాక్ తెచ్చుకుంటోంది.
ఇప్పటికే డైరెక్టర్ కార్తీక్ దండు, సాయిధరమ్ తేజ్ ఒకరినొకరు హగ్ చేసుకున్న వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.







