ఖైదీని మించిన ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం యావత్ మెగా ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించేందుకు చిరు రెడీ అవుతున్నాడు.

 Chiranjeevi Solid Dance Moves In Acharya, Chiranjeevi, Acharya, Ram Charan, Toll-TeluguStop.com

కాగా ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాలో చిరుకు సొంతమైన డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయా లేవా అనే సందేహం పలువురిలో నెలకొంది.

కాగా చిరు నటించిన ఖైదీ నెంబర్ 150లో చిరుతో కలిసి చరణ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి.ఇప్పుడు ఆచార్య చిత్రంలో కూడా చిరు-చరణ్‌లు కలిసి కళ్లు చెదిరే స్టె్ప్స్ వేసేందుకు రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాల టాక్.

ఓ పాటలో వీరిద్దరు కలిసి చేసే డ్యాన్స్‌కు థియేటర్ల టాప్ లేవాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.

పక్కా కమర్షియల్ అంశాలతో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఆచార్య చిత్రంపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో చిరు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతుండగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.వేసవి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాతో మెగాస్టార్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఈ సినిమాను నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube