టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి ఆచార్య సినిమా నష్టాల గురించి, నష్టాల భర్తీ గురించి తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు.ఆచార్య మూవీ నష్టాలను భర్తీ చేయడానికి నేను, నా కొడుకు రెమ్యునరేషన్ లో 80 శాతం ఇచ్చేశామని చిరంజీవి అన్నారు.
ఆచార్య సినిమా నష్టాల భర్తీ కోసం తన వంతు సహాయసహకారాలు ఇచ్చానని చిరంజీవి చెప్పకనే చెప్పేశారు.కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించి ఎంతమేర నష్టాల భర్తీ చేశారో తెలియాలి.
వాస్తవానికి కరోనా వల్ల ఆచార్య మూవీ బడ్జెట్ ఊహించని స్థాయిలో పెరిగింది.కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లను దాటుకుని ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.
టికెట్ రేట్లు పెంచడం కూడా ఈ సినిమాకు ఒక విధంగా మైనస్ అయింది.ఫస్ట్ వీకెండ్ వరకు ఆచార్య భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించగా ఆ తర్వాత కలెక్షన్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి.
ప్రస్తుతం గాడ్ ఫాదర్ హిట్ అని చెప్పుకుంటున్నా ఈ సినిమా కలెక్షన్లు ఆశించిన రేంజ్ లో లేవు.

గాడ్ ఫాదర్ ప్రస్తుతం చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.ఈ వీకెండ్ లో రిలీజవుతున్న సినిమాలలో కాంతార మినహా మరే సినిమాపై పెద్దగా అంచనాలు లేవు.గాడ్ ఫాదర్ సినిమాను సొంతంగా థియేటర్లలో రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు భారీస్థాయిలో నష్టాలు వచ్చినా ఆ నష్టాల భారం బయ్యర్లపై పడదనే సంగతి తెలిసిందే.
చిరంజీవి తన సినిమాల బడ్జెట్ ను తగ్గించుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో సీనియర్ హీరోలకు రిస్కీ బడ్జెట్లు ఏ మాత్రం సేఫ్ కాదు.ఈ కారణం వల్లే చిరంజీవి మినహా మిగతా స్టార్ హీరోలు ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం లేదు.చిరంజీవి కూడా పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







