మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే.తాజాగా చిరంజీవి పవన్ కళ్యాణ్ గొప్పదనం గురించి చెబుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఏపీలోని అధికార పార్టీ రాజకీయ నేతలు పవన్ పై పదేపదే విమర్శలు చేస్తుండటం చిరంజీవిని ఎంతగానో బాధ పెట్టిందని చిరంజీవి తాజాగా చేసిన కామెంట్ల ద్వారా అర్థమవుతోంది.
పవన్ కళ్యాణ్ నాకు బిడ్డలాంటి వాడని చిరంజీవి తెలిపారు.
పవన్ నిస్వార్థపరుడని ఫ్యామిలీ అంటే ఎంతో ప్రేమ ఉందని చిరంజీవి కామెంట్లు చేశారు.పదవులపై, డబ్బుపై పవన్ కు వ్యామోహం లేదని కొన్ని నెలల క్రితం వరకు పవన్ కు సొంతిల్లు కూడా లేదని చిరంజీవి కామెంట్లు చేశారు.
ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని చిరంజీవి చెప్పుకొచ్చారు.
అయితే పవన్ కళ్యాణ్ పై కొందరు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని ఆ విమర్శలు విన్న సమయంలో మనసు చివుక్కుమంటుందని ఆయన కామెంట్లు చేశారు.
పవన్ పై నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్లతో మాట్లాడటానికి కూడా నాకు ఇబ్బంది కలుగుతోందని చిరంజీవి కామెంట్లు చేశారు.ఉపాసన గర్భం దాల్చారనే వార్త కుటుంబానికి ఎంతో సంతోషం కలిగించిందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

ఆరు సంవత్సరాల నుంచి ఈ శుభవార్త వినాలని ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు.ఆ మాట విన్న వెంటనే నాకు, సురేఖకు కన్నీళ్లు వచ్చాయని మెగాస్టార్ చిరంజీవి కామెంట్లు చేశారు.ఉపాసనకు మూడో నెల వచ్చిన తర్వాత ఈ శుభవార్తను ఫ్యాన్స్ కు కూడా చెప్పామని ఆయన కామెంట్లు చేశారు.చిరంజీవి విమర్శల గురించి ఏపీలోని అధికార పార్టీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.







