మెగాస్టార్ ఫోన్ లో సురేఖ, పవన్ పేర్లను ఏ పేర్లతో ఫీడ్ చేసుకున్నారో తెలుసా?

సంక్రాంతి పండుగ కానుకగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు ఒక్కరోజు గ్యాప్ తో థియేటర్లలో రిలీజవుతున్నాయి.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి సుమ అడ్డా ప్రోగ్రామ్ కు హాజరైన సంగతి తెలిసిందే.

 Chiranjeevi Saved Pawan Charan Surekha Names Like This In Phone Contacts Details-TeluguStop.com

ఈ షోలో చిరంజీవి తన కుటుంబ సభ్యుల పేర్లను ఫోన్ లో ఏమని సేవ్ చేసుకున్నారో తాజాగా వెల్లడించారు.సురేఖ పేరును రే అని, చరణ్ పేరును చెర్రీ అని, పవన్ పేరును కళ్యాణ్ బాబు అని, సేవ్ చేసుకున్నానని చిరంజీవి వెల్లడించారు.

సుమ అడ్డా షోకు చిరంజీవి రావడంతో ఈ ఎపిసోడ్ కు రేటింగ్ కూడా పెరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.చిరంజీవి మారుతున్న కాలానికి అనుగుణంగా వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ కు కూడా ఎంతగానో ప్రాధాన్యతనిస్తున్నారు.

చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి తర్వాత సినిమా భోళా శంకర్ టైటిల్ తో తెరకెక్కనుండగా ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది.మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.ఒక తమిళ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

కీర్తి సురేశ్, తమన్నా హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనున్నారు.

చిరంజీవి, తమన్నా సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.గాడ్ ఫాదర్ తో సక్సెస్ అందుకున్న చిరంజీవి తర్వాత సినిమాలతో కూడా వరుస విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube