గాడ్ ఫాదర్ ను సల్మాన్ ఖాన్ కూడా కాపాడలేక పోయాడా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన కారణంగా హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేయడం జరిగింది.

ఈ సినిమా హిందీ రిలీజ్ కి మొదట సల్మాన్ ఖాన్ నో చెప్పాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి.కానీ చివరికి ఏం జరిగిందో ఏమో కానీ సల్మాన్ ఖాన్ సినిమా హిందీ రిలీజ్ కి ఓకే చెప్పాడు.

హిందీ లో సల్మాన్ ఖాన్ ఉండడం వల్ల మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉందని, చిత్ర యూనిట్ సభ్యులతో పాటు హిందీ బాక్సాఫీస్ వర్గాల వారు భావించారు.కానీ సల్మాన్ ఖాన్ మొత్తంగా కనిపించింది కనీసం 10 నిమిషాలు కూడా లేదు.

స్క్రీన్ ప్రజెన్స్‌ చాలా తక్కువగా ఉండడంతో సల్మాన్ ఖాన్ అభిమానులు థియేటర్ల కు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

Advertisement

హిందీ లో డబ్బింగ్ చేసి అక్కడ విడుదల చేసినందుకు గాను కాస్త ఎక్కువగానే ఖర్చు చేశారు, కనీసం ఆ మాత్రం అయినా ఈ సినిమా హిందీ వర్షన్ వెనక్కు రాబడుతుందా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు చర్చించుకుంటున్నారు.ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల విషయం గురించి మాట్లాడితే పాజిటివ్ గానే స్పందన వస్తోంది.కలెక్షన్స్ ఇప్పటికే వంద కోట్లు రూపాయలు దాటాయి.

కనుక లాంగ్‌ రన్‌ లో బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు అంటూ టాక్ వినిపిస్తుంది.మెగాస్టార్ మరియు సల్మాన్ ఖాన్ కలిసి నటించినప్పటికీ హిందీలో మాత్రం ఈ సినిమా పెద్దగా వసూళ్లను రావట లేక పోతుంది అంటూ బాక్సాఫీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

హిందీ వర్షన్ కనీసం 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉందని నిన్న మొన్నటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు చాలా బలంగా నమ్మకం వ్యక్తం చేశారు.కానీ సల్మాన్ ఖాన్ కూడా గాడ్ ఫాదర్ ని కాపాడలేక పోయాడు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు