చిరు పవన్ రేర్ పిక్.. వైరల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ !

మెగాస్టార్ అంటే అభిమానులకు ప్రత్యేకమైన అభిమానం.ఆయనతో మొదలైన అభిమానం తర్వాత పవన్ కళ్యాణ్ తో తారాస్థాయికి చేరుకుంది.

పవన్ ఫ్యాన్స్ ఆయనపై చూపించే అభిమానానికి అవధులు ఉండవు.మెగస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే సినిమాలో కలిసి నటిస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కానీ ఇప్పటి వరకు అది జరుగలేదు.సినిమాల్లోనే కాదు బయట కూడా వీరు ఒకే స్టేజ్ మీద కనపడరు.

ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు.అప్పుడు అభిమానులు పండగ చేసుకుంటారు.

Advertisement

అప్పట్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబోలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నట్టు ప్రకటించారు.కానీ అది ఇప్పటి వరకు జరుగలేదు.

వీరిద్దరూ కలిసి కనిపిస్తే చూడాలని అభిమానుల కోరిక.తాజాగా చిరు పవన్ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఫోటో ఇప్పటిది కాదు వాళ్ళు చాలా యంగ్ గా ఉన్నప్పటి ఫోటో.ఈ రేర్ ఫోటోను మెగా అభిమానులు షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఈ ఫోటో 1997 ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం తీసిన ఫోటో.పవన్ కు ఇలాంటి ఫోటో షూట్స్ ఇష్టం లేకపోయినా వాళ్ళ అన్నయ్యతో కలిసి ఫిలింఫేర్ కోసం ఫొటోకు ఫోజులిచ్చారు.ఈ ఫొటోలో చిరు పవన్ ఇద్దరు చాలా యంగ్ అండ్ డాషింగ్ గా ఉన్నారు.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 

తన అన్నయ్యను పవన్ వెనుక నుండి హగ్ చేసుకుంటూ ఫోటో దిగారు.ఈ ఫోటోను ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ షేర్ చేయడంతో బయటకు వచ్చింది.దేవి శ్రీ వావ్ వాటే ఫోటో అంటూ షేర్ చేసారు.

Advertisement

ఈ రేర్ ఫోటో ఇప్పుడు అభిమానులకు బాగా నచ్చి వైరల్ చేస్తున్నారు.ఇది ఇలా ఉండే ప్రస్తుతం చిరంజీవి, పవన్ కళ్యాణ్ వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు.

తాజా వార్తలు