కూతురు కోసం మెగాస్టార్ వరుసగా రెండు..!

మెగాస్టార్‌ చిరంజీవి ( Megastar Chiranjeevi ) వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు.

గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్య ( Waltheru Veeraya ) సినిమా తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇదే ఏడాది ఆగస్టు లో భోళా శంకర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు

.మెహర్‌ రమేష్ ( Meher Ramesh ) దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఆ తర్వాత చిరంజీవి చేయబోతున్న రెండు సినిమా లు దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యాయి.

ఆ రెండు సినిమా లు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.మరో ఇంట్రెస్టింగ్‌ విషయం ఏంటి అంటే ఆ రెండు సినిమా లను కూడా మెగా స్టార్‌ చిరంజీవి కూతురు అయిన సుస్మిత కొణిదెల ( Sushmita Konidela ) నిర్మించబోతున్నారు.

Advertisement

ఇప్పటికే సుస్మిత వెబ్ సిరీస్ ను నిర్మించిన అనుభవం దక్కించుకున్నారు.కనుక మెగాస్టార్‌ చిరంజీవి తన కూతురుకు రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి పెట్టేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

అందులో ఒకటి మలయాళం హిట్ మూవీ బ్రో డాడీ ( bro daddy ) కి రీమేక్.సోగ్గాడే చిన్ని నాయన ఫేం కళ్యాణ్‌ కృష్ణ రీమేక్ కు దర్శకత్వం వహించబోతున్నాడు.ఆ తర్వాత బింబిసార దర్శకుడు వశిష్ఠ్‌ కి కూడా మెగాస్టార్ చిరంజీవి ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ రెండు సినిమా లను కూడా సుస్మిత నిర్మించనున్న నేపథ్యం లో భారీ అంచనాలు నెలకొన్నాయి.కూతురు కోసం భారీ ప్రాజెక్ట్‌ లు రెండు చేస్తున్నాడు.అందులో ఒకటి కాకున్నా ఒకటి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ఈజీగా కూతురుకు లాభాల పంట పండటం ఖాయం.

చిరు ఎలాగూ పారితోషికం తీసుకోడు కనుక పాతిక నుండి ముప్పై కోట్ల మేకింగ్ ఖర్చుతో సినిమా పూర్తి అవుతుంది.కనుక ఏ స్థాయి లో సుస్మిత కి లాభాల పంట పండేనో అర్థం చేసుకోవచ్చు.

'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 
Advertisement

తాజా వార్తలు