మెగా స్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ప్రస్తుతం భోళా శంకర్ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆగస్టు లో విడుదల అవ్వబోతున్న భోళా శంకర్ తర్వాత సినిమా తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమా ఏంటి అనేది ఇప్పటి వరకు అధికారికంగా కన్ఫర్మ్ అవ్వలేదు.
కానీ గత కొన్నాళ్లుగా మలయాళ సూపర్ హిట్ చిత్రం బ్రో డాడీ( Brodaddy Remake ) ని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి రీమేక్ చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా లో సిద్దు జొన్నలగడ్డ ( Siddhu Jonnalagadda )ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు.
హీరోయిన్స్ గా త్రిష మరియు శ్రీ లీల కనిపించబోతున్నారు.
ఆ సినిమా తర్వాత లేదా ఆ సినిమా తో సమాంతరంగా చిరంజీవి మరో సినిమా ను చేయబోతున్నాడు.సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ధమాకా తో పాటు గత కొన్నాళ్లుగా పలు సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా వ్యవహరిస్తున్న ప్రసన్న కుమార్ బెజవాడ( Prasanna Kumar Bejawada ) దర్శకత్వం లో చిరు ఒక సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.నాగార్జున తో ఈ సినిమా కన్ఫర్మ్ అయ్యిందని అంతా భావించారు… మీడియా లో కూడా వీరి సినిమా ప్రారంభం అయినట్లుగానే కథనాలు వచ్చాయి.
కానీ కారణం ఏంటో కానీ నాగార్జున( Nagarjuna ) తో ప్రసన్న కుమార్ బెజవాడ సినిమా క్యాన్సల్ అయ్యింది.అందుకే చిరంజీవి తో ఈయన సినిమా కన్ఫర్మ్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున కు గతంలో వినిపించిన కథ నే ఇప్పుడు చిరంజీవి తో చేసేందుకు ప్రసన్న కుమార్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడట.స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది.
చిరంజీవి కి తగ్గట్లుగా మంచి స్క్రిప్ట్ తో సినిమా ను రూపొందించే విధంగా మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ప్రసన్న కుమార్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.