చదువుకున్న కాలేజ్ కోసం చిరంజీవి చేసిన సహాయం తెలిస్తే షాకవ్వాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఈ స్థాయికి ఎదగడంలో ఉన్న కష్టం అంతాఇంతా కాదు.చిరంజీవి ఎంతో కష్టపడటం వల్లే మెగా ఫ్యామిలీకి ఈ స్థాయిలో గుర్తింపు వచ్చింది.

 Chiranjeevi Kind And Great Heart About Yn College Details, Chiranjeevi , Chiranj-TeluguStop.com

ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్న చిరంజీవి ఆ మొత్తంలో 20 శాతం వరకు సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు.అయితే చిరంజీవి చదువుకునే కాలేజ్ కోసం( College ) తాజాగా సాయం చేయగా ఆ సహాయం హాట్ టాపిక్ అవుతోంది.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.చిరంజీవి వైఎన్ కాలేజ్ లో( YN College ) చదువుకోగా ఈ కాలేజ్ అభివృద్ధి కోసం ఆయన ఏకంగా 50 లక్షల రూపాయలు ఇచ్చారని తెలుస్తోంది.

గతంలో చిరంజీవి ఎంపీగా పని చేశారనే సంగతి తెలిసిందే.ఆ సమయంలో ఎంపీ నిధుల నుంచి మెగాస్టార్ చిరంజీవి ఈ మొత్తం సహాయం చేశారు.ఈ సహాయం ద్వారా చిరంజీవి చదువుకున్న కాలేజ్ రుణం తీర్చుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవితో పాటు ఆ కాలేజ్ లో చదివిన మరి కొందరు సినీ ప్రముఖులు సైతం ఆ కాలేజ్ కోసం భారీ మొత్తంలో సహాయం చేశారని సమాచారం అందుతోంది.భవిష్యత్తులో కాలేజ్ అభివృద్ధికి డబ్బు అవసరమైతే తన సొంత డబ్బును ఇస్తానని మెగాస్టార్ చెప్పారని బోగట్టా.ఈ మధ్య కాలంలో ఇతరులకు సహాయం చేసే మనస్సు ఎక్కువమందికి ఉండటం లేదని ఆ విషయంలో చిరంజీవి గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాకే పరిమితం కాగా కీర్తి సురేష్ డేట్ల వల్ల ఈ సినిమా అంతకంతకూ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాతో తమన్నా భారీ బ్లాక్ బస్టర్ సాధించాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube