ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అయోధ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది.అంతేకాకుండా దేశవ్యాప్తంగా రామనామ స్మరణతో మారుమోగిపోతోంది.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అయోధ్యకు సంబంధించిన ఫోటోలు వీడియోలే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే చాలామంది సెలబ్రిటీలకు( celebrities ) అయోధ్యకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే.
ఇప్పటికే చాలామంది అక్కడికి చేరుకున్నారు.అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఫ్యామిలీకి కూడా అయోధ్య నుంచి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే.
అయోధ్యకు ఆహ్వానం అందడం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.అయోధ్య రామమందిరంలో( Ayodhya Ram Mandir ) బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందడం, సోమవారం ప్రతిష్ఠ జరుగబోతున్న నేపథ్యంలో ఆయనకు ఆహ్వానం అందం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను, ఈ ఆహ్వానాన్ని అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేయడానికి దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను అని చిరంజీవి ట్వీట్‌లో రాసుకొచ్చారు.ఐదు వందల సంవత్సరాలకు పైగా తరతరాలుగా భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న ఆ మహత్తర అధ్యాయం.ఆ దివ్యమైన చిరంజీవి హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే స్వయంగా ఈ భూలోక అంజనా దేవి కొడుకు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది.
ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి.నాకు మరియు నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం.గౌరవనీయులైన ప్రధాన మంత్రి మోదీ జీ ఈ గౌరవాన్ని అందించినందుకు హృదయపూర్వక అభినందనలు.అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారికి హృదయపూర్వక అభినందనలు.ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు.రేపటి బంగారు క్షణాల కోసం ఎదురుచూస్తున్నా.
జై శ్రీ రామ్ అని చిరంజీవి ట్విట్టర్ లో పేర్కొన్నారు.కాగా ఇప్పటికే మెగా ఫ్యామిలీ అందరూ అయోధ్యకు చేరుకున్న విషయం తెలిసిందే.
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.