సీఎం కేసీఆర్ బర్త్ డేకు చిరంజీవి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే!

రాష్ట్రంలో ఈరోజు (ఫిబ్రవరి 17) ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.కొన్ని జిల్లాలలో కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పలు వేడుకలు జరుపుతున్నారు.

ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.అంతే కాకుండా సినీ నటులు, రాజకీయ నాయకులు, ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అంతేకాకుండా కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ కు రెండున్నర కేజీల బంగారు చీర ను అందించారు మంత్రి తలసాని, కూన వెంకటేశ్వర గౌడ్, ఆలయ ఈవో అన్నపూర్ణ.ఈ విధంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు చిరంజీవి.రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపిన కోటి వృక్షార్చన పిలుపుకు ఎంతోమంది స్పందిస్తున్నారు.

అంతేకాకుండా ఇందులో పాల్గొనడానికి వ్యాపార, వాణిజ్య, సినిమా, పారిశ్రామిక, క్రీడారంగంలో చెందిన వాళ్లంతా ముందుకొస్తున్నారు.ఇటీవల చిరంజీవి కూడా ఇందులో పాల్గొన్న గా కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటి కెసిఆర్ గారికి పుట్టినరోజు కానుక అందిస్తామంటూ తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష, కోరిక.

Advertisement

దీనికోసం మన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటుదాం.వాటిని పర్యవేక్షించే బాధ్యత మనమే తీసుకుందాం.

మన ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు కానుకను అందిద్దాం నటుడు చిరంజీవి తెలిపారు చిరంజీవి తన ట్విట్టర్ లో పంపిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు