Chiranjeevi : చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ఈ ఏడాదిలో చేసిన మిస్టేక్స్ గురించి మీకు తెలుసా ?

చిరంజీవి( Chiranjeevi ).ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గా ఎదిగాడు.

 Chiranjeevi And Pawan Kalyan Mistakes In 2023-TeluguStop.com

హీరోగా చిరంజీవి వచ్చిన తర్వాత ఆ కుటుంబం నుంచి అరడజన్ కు పైగా హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు.మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అయితే స్టార్ హీరోలుగా ప్రస్తుతం టాలీవుడ్ లో తొక్కుకున్నారు.

వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నెంబర్ 2 హీరోలుగా పర్వాలేదు అనిపించుకుంటున్నారు.ఇంత మంది నటులు మెగాస్టార్ ఫ్యామిలీ( Megastar family ) నుంచి వచ్చారంటే దానికి కారణం చిరంజీవి మాత్రమే ఆయన నీడలోనే ఈ హీరోలంతా ఎదిగారు అలాగే చిరంజీవి పరువు కాపాడుతూ అందరూ వారి స్థాయిలో వారు బాగానే సినిమాలను చేసుకుంటూ కెరియర్ ను నిలబెట్టుకుంటున్నారు.

అయితే ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో పాతుకపోయినా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ మాత్రం ఈ స్థాయికి వచ్చాక కొన్ని తప్పులు చేస్తున్నారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Pawan Kalyan-Movie

ఇక చిరంజీవికి మరియు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఖచ్చితంగా 2023 చాలా బ్యాడ్ మెమోరీస్ ని మిగిల్చింది.ముఖ్యంగా చిరంజీవి అయితే కోలుకోలేని విధంగా ఈ ఏడాది నష్టపోయారు.తమిళంలో సూపర్ హిట్ అయిన వీరం సినిమాని తెలుగులో భోళా శంకర్ ( Bhola Shankar)పేరు మీద చేయగా మెహర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది అయితే ఈ సినిమాకి మొదటి షో నుంచి ప్రేక్షకులు డిజాస్టర్ టాక్ ఇచ్చారు.

ఈ సినిమా తర్వాత చిత్రాలలో నటించేది లేదు అంటూ చిరంజీవి కరాకండిగా తేల్చేశారు.అప్పటికి ఒప్పుకున్న రీమేక్ చిత్రాలను సైతం హోల్డ్ చేసి కేవలం నేరుగా చేసి కథలనే ఎంపిక చేసి వశిష్ట చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Pawan Kalyan-Movie

చిరంజీవి మాదిరిగానే పవన్ కళ్యాణ్ సైతం రీమేక్ చిత్రాన్ని చేసి బోల్తా పడ్డారు వినోదయ సీతం అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో బ్రో( Bro ) పేరుతో విడుదల చేయగా ఈ రీమిక్స్ సినిమా పవన్ కళ్యాణ్ కి పెద్దగా పేరును తీసుకురాలేదు.ఈ చిత్రం తర్వాత రీమేక్ సినిమా కథలను వినడానికి కూడా పవన్ కళ్యాణ్ సాహసించడం లేదట.ఇక ముందు ముందు స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లోనే నటిస్తానని కూడా తేల్చేశారట.పవన్ కళ్యాణ్ మరి ఈ ఇద్దరు బ్రదర్స్ ఈ తప్పులను మరోసారి చేయకుండా వచ్చే ఏడాది అయిన సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube