రాజాకీయంగా దెబ్బలాడుకుంటున్న చిరంజీవి - బాలకృష్ణ ?

చిరంజీవి బాలకృష్ణ పోటిపడుతున్నారంటే ఆ వాడీ వేడి వాతావరణమే వేరు.అభిమానుల గొడవలు, రాజకీయాల కలబోత, బాక్సాఫీస్ వద్ద సందడి.

 Chiranjeevi And Balakrishna War Gets A Political Flavor ?-TeluguStop.com

అన్ని కలిసికట్టుగా వస్తాయి.ఇప్పుడే అదే జరుగుతోంది.

మళ్ళీ రాజకీయంగా దెబ్బలాడుకుంటున్నారు.ఈ కథలో చాలా ట్విస్టులు ఉన్నాయి శ్రద్ధగా చదవండి.

మొదట సినిమా విడుదల తేదిల మీద చర్చ జరిగింది.నేను ముందు వస్తాను, కాదు నేనే ముందు వస్తాను అని పోటిపడ్డారు.

మొత్తానికి ఆ రౌండ్ 1 చిరంజీవే గెలిచేసారు.ఆయన జనవరి 11వ తేదిన సినిమా విడుదల చేసుకుంటున్నారు.

బాలయ్య బాబు 12 వ తేదిన గౌతమీపుత్ర శాతకర్ణిని బాక్సాఫీస్ సమరంలో దింపుతున్నారు.మరోవైపు ప్రీ రిలీజ్ ఫంక్షన్ విజయవాడలో జరగకుండా అడ్డుకున్నది బాలకృష్ణ, తెదేపా పార్టీలే అని మేగాఫ్యాన్స్ ఆరోపణ.

మొత్తానికి ఫంక్షన్ గుంటూరులో జరుగుతోంది.

ఇక గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి తెలంగాణ రాష్ట్రంలో పన్ను మినహాయింపు రాకుండా చిరంజీవి క్యాంప్ టీఆర్ఎస్ పార్టీ మీద ఒత్తిడి తెస్తున్నారని ఇప్పుడు నందమూరి అభిమానులు ఆరోపణ వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి పన్ను మినహాయింపు రావడం దాదాపుగా ఖాయం అయిపోగా, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం బయటపడలేదు.మరి ఖైది నం 150 ఫంక్షన్ ని నిజంగానే బాలకృష్ణ అడ్డుకున్నారా ?

దానికి బదులుగా ఇప్పుడు తెలంగాణలో పన్ను మినహాయింపుని అడ్డుకునేందుకు చిరంజీవి ప్రయత్నిస్తున్నారా ? లేక ఇదంతా అభిమానుల గొడవేనా ?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube