మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ హీరో గా నటించిన వీర సింహారెడ్డి సినిమా లు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ రెండు సినిమా లు కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందాయి.
ఈ రెండు సినిమాలు అనుకోకుండా ఈ సంక్రాంతి కి విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది.ఒకే నిర్మాణ సంస్థ నుండి వస్తున్న సినిమా లు సంక్రాంతి బరిలో నిలవడం ఇదే మొదటి సారి.
కనుక మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపేందుకు ప్రేక్షకుల్లో సినిమా లను ప్రమోట్ చేసేందుకు వినూత్నంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు.అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లను కలిపి ఒక ఇంటర్వ్యూ చేయాలని నిర్ణయించారంటూ ఆ మధ్య తెగ ప్రచారం జరిగింది.

ఆ ఇంటర్వ్యూ కోసం సుమ తో చర్చలు కూడా జరిగాయట.కానీ ఇప్పటి వరకు మైత్రి మూవీ మేకర్స్ వారి నుండి కానీ ఇతర చిత్ర యూనిట్ సభ్యుల నుండి కానీ ఆ విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు.సినిమా ల యొక్క విడుదల తేదీలు దగ్గర పడుతున్నాయి.విడుదలకు కనీసం రెండు వారాల గడువు కూడా లేదు.అయినా ఇప్పటి వరకు హీరోల యొక్క ఇంటర్వ్యూ షూట్ జరగలేదు.ఇద్దరు స్టార్ హీరోల ఇంటర్వ్యూ అంటే కచ్చితంగా ఓ స్థాయిలో అంచనాలు ఉంటాయి.
కనీసం రెండు వారాల ముందుగానే చిత్రీకరించాల్సి ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఇద్దరు స్టార్ హీరోల యొక్క ఇంటర్వ్యూ చిత్రీకరించినట్లుగా లేదు.ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ తప్పదా అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.
ఒకవేళ ఇద్దరు హీరోల యొక్క ఇంటర్వ్యూ వస్తే కచ్చితంగా రెండు సినిమాల యొక్క స్థాయి పెరగడం ఖాయం.అలాగే ఆ ఇంటర్వ్యూ నెంబర్ బిఫోర్ అన్నట్లుగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







