యూపీఎస్సీ పరీక్షలో( UPSC Exam ) పాస్ కావడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సినా అవసరం లేదు.అయితే కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు చిన్ని జయంత్ కొడుకు మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ప్రశంసలు అందుకుంటున్నారు.
సినిమా రంగాన్ని తన కెరీర్ గా ఎంచుకోకుండా వేరే టార్గెట్ ను పెట్టుకున్న శృతన్ జయ( Srutan Jaya ) లక్ష్యాన్ని సాధించి వార్తల్లో నిలిచారు.
శృతన్ జయ స్కూల్, కాలేజ్ లో చదువుకునే సమయంలో నాటకాలలో పాల్గొన్నా ఆయన లక్ష్యం వేరు కావడంతో తల్లీదండ్రులు కూడా అతడిని చదువు విషయంలో ఎంతో ప్రోత్సహించారు.దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటైన యూపీఎస్సీలో శృతన్ జయ క్వాలిఫై కావడం అతని కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.అశోకా యూనివర్సిటీ నుంచి శృతన్ జయ మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.
మాస్టర్ డిగ్రీ పూర్తైన తర్వాత శృతన్ జయ స్టార్టప్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు.రాత్రంతా ఉద్యోగం చేస్తూ ఉదయం సమయంలో ప్రిపేర్ అయ్యేవారు.ఇతని పూర్తి పేరు శృతన్ జయ నారాయణన్ కాగా తన సక్సెస్ స్టోరీతో శృతన్ జయ ప్రశంసలు అందుకుంటున్నారు.2015 సంవత్సరంలో 75వ ర్యాంక్ తో ఆయన సత్తా చాటారు.ప్రస్తుతం త్రిపూర్ జిల్లాలో సబ్ కలెక్టర్ గా శృతన్ జయ పని చేస్తున్నారు.
శృతన్ జయ భవిష్యత్తులో కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.శృతన్ జయ టాలెంట్ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువేనని మరి కొందరు చెబుతున్నారు.శృతన్ జయ సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.
శృతన్ జయ భిన్నమైన రంగాన్ని ఎంచుకోవడంతో పాటు ఐఏఎస్ సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.