సమంతకు నాకు పెళ్లి అయ్యింది.. చైతూ సెకండ్‌ వ్యక్తే

తమిళ నాట మీటూ అంటూ పెద్ద సంచలనం సృష్టించిన డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కమ్‌ సింగర్‌ అయిన చిన్మయి అక్కడ తీవ్ర వివాదాస్పదం అవుతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే ఈమెను డబ్బింగ్‌ ఆర్టిస్టు అసోషియేషన్‌ నుండి తొలగించడం జరిగింది.

 Chinmayi Says About Her Marriage With Samantha-TeluguStop.com

ఆ విషయంపై పెద్ద ఉద్యమమే చేస్తున్న చిన్మయి తాజాగా తమ్మారెడ్డి భరద్వాజతో ముచ్చటించింది.ఆ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేయడం జరిగింది.

చిన్మయి మాట్లాడుతూ… తనకు సమంత అంటే చాలా ఇష్టం అని, మా ఇద్దరి పెళ్లి ఎప్పుడో అయ్యిందని, మేమిద్దరం భార్య భర్తలుగా ఉంటామని నవ్వుకుంటూ చెప్పుకొచ్చింది.సమంత జీవితంలో నాగచైతన్య రెండవ వ్యక్తి అని, తాను మొదటి వ్యక్తిని అంటూ గట్టిగా నవ్వేసింది.ఇక నా జీవితంలో కూడా రాహుల్‌ రవీంద్ర రెండవ వ్యక్తి అని, నాకు మొదటి వ్యక్తి సమంత అంటూ పేర్కొంది.

నా మొదటి తెలుగు సినిమా నాగచైతన్య మూవీ అవ్వగా, రాహుల్‌ మరియు సమంతలు కలిసి వారి మొదటి సినిమాలు చేశారని ఈ సందర్బంగా చిన్మయి చెప్పుకొచ్చింది.ఆడవారికి ఉపయోగపడే మీటూ ఉద్యమంలో తాను భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని, అయితే కొందరు మాత్రం నన్ను టార్గెట్‌ చేయడం బాధగా ఉందని, ఎప్పటికైనా జనాలకు అన్ని విషయాలు కులంకశంగా తెలుస్తాయని ఈ సందర్బంగా ఆమె చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube