కరోనా మహమ్మారి సమయంలో భారతీయ సంతతికి చెందిన మహిళను జాతిపరంగా అవమానించినందుకు, ఛాతీపై తన్నినందుకు చైనా సంతతికి చెందిన వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధించబడింది.2021, మే 7న సింగపూర్ దేశం, చోవా చు కాంగ్ హౌసింగ్ ఎస్టేట్‌లోని ( Choa Chu Kong Housing Estate )నార్త్‌వేల్ కండోమినియం సమీపంలో మేడమ్ హిందోచా నీతా విష్ణుభాయ్( Neeta Vishnubhai ) (57)పై వాంగ్ జింగ్ ఫాంగ్( Wang Jing Fang ) (32) అనే వ్యక్తి దాడి చేశాడు.
వాంగ్ జింగ్ ఫాంగ్ మేడమ్ నీతా మాస్క్ తీసివేసినందున మాస్క్ వేసుకోవాలని ఆమెను కోరాడు.నీతా మాత్రం తను వేగంగా నడుస్తున్నానని, వ్యాయామం చేస్తున్నానని, చెమటలు కక్కుతున్నాని సైగ చేసి చెప్పింది.మాస్క్ ఇప్పుడు ధరించలేరని క్లారిటీ ఇచ్చింది.అయితే, వాంగ్ మేడమ్ నీతాను తిట్టి, మాటలతో దూషించాడు.మేడమ్ నీతా ప్రతిస్పందిస్తూ, పరిస్థితిని శాంతింప చేసే ప్రయత్నంలో “గాడ్ బ్లెస్ యు” అని చెప్పారు.వాంగ్ తర్వాత మేడమ్ నీతా ఛాతీపై తన్నాడు.
ఆమె చేతిపై కూడా గాయపరిచాడు.దాంతో నీతా మేడమ్ భయంతో వణికి పోయింది.
ఆ చేదు అనుభవం ఎదురయ్యేసరికి ఆమె చాలా బాధపడింది.ఆ దాడి జరిగిన ప్రదేశానికి వెళ్ళినప్పుడల్లా ఆమెకు ఆ సంఘటన గుర్తుకువచ్చి చాలా బాధపడుతుంది.
తనపై అన్యాయంగా దాడి చేసిన వ్యక్తిపై ఆమె సింగపూర్ పోలీస్ స్టేషన్‌లో( Singapore Police Station ) ఫిర్యాదు చేసింది.ఈ కేసు పై విచారణ జరిపిన కోర్టు వాంగ్ ఒక్కో దాడికి, బాధితురాలి జాతి భావాలను గాయపరిచినందుకు దోషిగా నిర్ధారించింది.అతనికి మూడు నెలల జైలు శిక్ష విధించింది.బాధితురాలికి 13.20 సింగపూర్ డాలర్లు (దాదాపు రూ.800) పరిహారం చెల్లించాలని ఆదేశించింది.