రష్యాకు పరోక్షంగా ఫుల్ సపోర్ట్ అందిస్తున్న చైనా.. జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు

ఉక్రెయిన్-రష్యా( Ukraine-Russia ) మధ్య యుద్ధం ఎడతెగకుండా ఏడాది కాలంగా కొనసాగుతోంది.ఉక్రెయిన్‌కు అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ దేశాలు బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి.

 China Is Providing Full Support To Russia Indirectly Xi Jinping's Key Comments,-TeluguStop.com

రష్యా మాత్రం ఒంటరిగా పోరాడుతోంది.ఈ తరుణంలో రష్యాకు చైనా బాసటగా నిలిచింది.

రష్యాలో ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పర్యటించారు.ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మధ్యవర్తి పాత్రను పోషిస్తామని ఆయన చెప్పారు.

రష్యాలో జిన్‌పింగ్ పర్యటనకు ముందు చైనా వార్తాపత్రికలో పుతిన్ ఒక వ్యాసం రాశారు.ఈ వ్యాసంలో మాస్కో-బీజింగ్( Moscow-Beijing ) మధ్య సంబంధాలు ప్రచ్ఛన్న యుద్ధంలోని రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం కంటే బలంగా ఉన్నాయని అన్నారు.

చైనా అధ్యక్షుడు ఇరు దేశాల మధ్య సంబంధాలను కొత్త స్థాయికి తీసుకువెళతారనడంలో తమకు ఎటువంటి సందేహం లేదని పుతిన్ పేర్కొన్నారు.

హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్( International Criminal Court ) ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది.ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.ఈ తరుణంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యాలో పర్యటించారు.

పుతిన్-జిన్‌పింగ్ మధ్య మధ్య సోమవారం నాలుగున్నర గంటలపాటు చర్చలు జరిగాయి.పర్యటనకు ముందు రష్యా పత్రిక ప్రావ్డా (Pravda)లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఓ వ్యాసం రాశారు.

అందులో ‘అన్ని దేశాల న్యాయబద్ధమైన సరిహద్దు ఆందోళనలను ఇతరులు గౌరవించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.తమ మద్దతు రష్యాకే ఉందని పరోక్షంగా తెలియజేశారు.

రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం మరియు ఆర్థిక సహకారం యొక్క “కొత్త శకం” అని కొనియాడారు.రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో “ఉక్రెయిన్ సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని” జిన్‌పింగ్ పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube