వైరల్‌ వీడియో : విమానం నడుపుతూ నిద్ర పోయిన పైలెట్‌

ప్రపంచంలో ఏమూలకు వెళ్లాలి అన్నా కూడా అతి తక్కువ సమయంలో విమానంలో ప్రయాణించవచ్చు.అయితే విమాన ప్రయాణం అనేది కొన్ని సార్లు ప్రమాదకరంగా మారుతుంది.

 China Airlines Captain Has Been Sleeping In Command Of Boeing 747-TeluguStop.com

ఏ సమయంలో విమానాలు క్రాష్‌ అవుతాయో అనే భయం ఎక్కువ శాతం మందిలో ఉంది.అలా అని విమానాలు ఎక్కకుండా ఉండటం లేదు.

విమానాలు క్రాష్‌ అవుతున్నాయి కదా అని ఎక్కకుండా ఉంటే కష్టం అవుతుంది.అయితే విమానాలు క్రాష్‌ అవ్వడంకు ప్రధాన కారణం టెక్నికల్‌ లోపం అయ్యి ఉంటుంది.

వందల మంది ప్రయాణించే విమానాలను అత్యంత నాణ్యతతో తయారు చేయడంతో పాటు, ప్రతి సారి కూడా అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు.

ఇక విమానాన్ని నడిపే పైలెట్‌ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

విమాన్ని నడిపే వ్యక్తికి శిక్షణ కఠినంగా ఇవ్వడంతో పాటు, ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు ఇస్తూ ఉంటారు.అలాంటి పైలెట్‌ విమానం నడుపుతూ అదే ఆకాశంలో విమానాన్ని నడుపుతూ నిద్ర పోవడం అంటే ఎంత సిగ్గుమాలిన పనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చైనా ఎయిర్‌లైన్స్‌ చెందిన బోయింగ్‌ 747 పైలెట్‌ తన డ్యూటీని విష్మరించి నిద్ర పోయాడు.

ఆ విషయం ఒక వీడియో ద్వారా తెలిసింది.ఒక వ్యక్తి వీడియో తీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.విమానంలో ఇద్దరు పైలెట్లు ఉంటారు కనుక సరిపోయింది.

లేదంటే పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పక్కన ఉండే కో పైలేట్‌ విమానాన్ని నడుపుతూనే తన సహ పైలెట్‌ నిద్ర పోతున్న విషయాన్ని మొబైల్‌లో చిత్రీకరించాడు.

ఆ వీడియో కాస్త బయటకు వచ్చింది.ఏదో సరదాగా ఆ వీడియోను తీసిన వ్యక్తి ఇదో పెద్ద సంచలనం అవుతుందని భావించలేదు.

అనూహ్యంగా ఆ వీడియో బయటకు రావడంతో చైనా ఎయిర్‌ లైన్స్‌ సదరు పైలెట్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.కో పైలెట్‌ వ్యవహారంపై కూడా అసహనంతో ఉంది.ప్రస్తుతానికి ఇద్దరిని సస్పెండ్‌ చేసినట్లుగా తెలుస్తోంది.విధినిర్వహణలో ఇద్దరు కూడా తప్పు చేశారని చైనా అధికారులు నిర్ణయించారు.అందుకే వారిని సస్పెండ్‌ చేశారు.వారిపై కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube