ఆకలితో ఉన్న తాబేలుకు ఆహారం పెట్టిన చింపాంజీ.. వీడియో వైరల్

ఇంటర్నెట్‌లో వివిధ రకాల జంతువుల మధ్య స్నేహ సంబంధాలు ఎంతో ముచ్చటగొలుపుతుంటాయి.వేర్వేరు జాతులకు చెందిన జంతువుల మధ్య స్నేహాన్ని చూసినప్పుడు ఎంతో బాగుంటుంది.

 Chimpanzee Feeding A Hungry Turtle Tourists, Chinapnajee, Food Eating, Viral Soc-TeluguStop.com

కానీ ఆ విభిన్న జాతుల జంతువులు ఒకదానితో ఒకటి సహకరించుకుంటూ సంతృప్తికరమైన జీవితాలను గడుపుతుంటాయి.ఇదే కోవలో చింపాంజీ, తాబేలు మధ్య చిగురించిన స్నేహం నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

తాను తింటున్న యాపిల్‌ను తాబేలుకు కూడా చింపాంజీ తినిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.జంతువులు ఒకదానికొకటి తాము వేర్వేరు జాతుల జీవులం అని తెలిసి, చేస్తున్న స్నేహం నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

మనుషుల్లాగే చింపాంజీలు ఎన్నో భావోద్వేగాలు చూపిస్తుంటాయి.

మిగిలిన అనేక జంతువులతో తమ స్నేహాన్ని కనబరుస్తుంటాయి.ఇటీవల బ్యూటెంగెబిడెన్ అనే ట్విట్టర్ ఖాతాలో ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ అయింది.

చింపాంజీ-తాబేలు మధ్య స్నేహాన్ని తెలియజేస్తూ, ఆ వీడియోకు “షేరింగ్ ఈజ్ కేరింగ్” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.చింపాంజీ తన తాబేలు స్నేహితుడితో కలిసి యాపిల్‌ను తినడం, ఒకదానికొకటి తినిపించుకోవడం అందులో ఉంది.

జూ ఎన్‌క్లోజర్‌లో ఆ రెండు జీవులూ అందమైన సాయంత్రాన్ని ఆస్వాదించినట్లు కనిపిస్తోంది.వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు 7.5 మిలియన్లకు పైగా వ్యూస్, 2.98 లక్షల లైక్‌లు వచ్చాయి.మనసులను హత్తుకునే వీడియో నెటిజన్లను కదిలించింది.వాటి స్నేహాన్ని కొనియాడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube