చీకోటి ప్రవీణ్ చీకటి దందా రాజకీయ నాయకులకు చుట్టుకునే అవకాశాలున్నాయి.చీకోటి దందా వెనుక తెలంగాణలో అధికారం చెలాయిస్తున్న పెద్ద తలల హస్తం ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే తెలంగాణలో ఇద్దరు మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు, ఏపీలోఇద్దరు మాజీ మంత్రులు, టీడీపీ, వైసీపీకి చెందిన రాజకీయ పార్టీల నేతల హస్తం ఉన్నట్లు సమాచారం అందుతోంది.కొంత మంది మంత్రులు, మాజీ మంత్రులు పేకాట ఆడితే తప్పేముందని బహిరంగానే చెపుతున్నారు… చీకోటి చీకటి కోణంలో తవ్వినా కొద్దీ పెద్ద తలలు బయటపడుతున్నట్లు వినికిడి.
తెలంగాణలో 200 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు ఈడీ గుర్తించింది.తాజాగా పెద్దగా ప్రాచుర్యం లేని, ఎవరికీ తెలియని ట్రై కలర్స్ అనే రియల్ ఎస్టేట్ షెల్ కంపెనీపై ఈడీ దాడులు చేస్తున్నట్లు సమాచారం…
చీకోటి రాజకీయ నాయకులకు మధ్యవర్తిత్వం వహిస్తూ రాజకీయ నాయకుల సొమ్మును హవాలా రూపంలోకి మార్చుతున్నట్లు సమాచారం.దాదాపు 200 షెల్ కంపెనీల ద్వారా హవాలా సొమ్మును సీక్రెట్ గా దుబాయ్ కి తరలిస్తున్నట్లు ఈడీ రైడ్స్ లో వెల్లడవుతున్నట్లు సమాచారం.30 మంది ఎమ్మెల్యేల నుంచి నెలకు 30 నుంచి 50 లక్షల వరకు వసూలు చేసి దుబాయ్ లో రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.నెలకు 7 నుంచి 8 కోట్లు దుబాయ్ కి తరలివెళ్లినట్లు సమాచారం.అలాగే ఈ సొమ్ము మొత్తాన్ని గత ‘ఏడేళ్ల నుంచి దుబాయ్ లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలోకి పెట్టుబడుల రూపంలో తరలిస్తున్నట్లు సమాచారం.

క్యాసినో దందాకు సంబంధించి ట్రావెల్ ఏజెంట్ సంపత్ పర్యవేక్షణలో సముద్ర మార్గం ద్వారా వీరిని దుబాయ్ కి చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.దుబాయ్ లోని రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి తిరిగి తెలంగాణ ప్రాంతంలోని పెద్దగా ప్రాచుర్యం లేని సక్కుభాయి సొసైటీ, ఫెనిక్స్ ఇమార్, ట్రైకలర్స్ అనే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.క్రూయిజర్ ద్వారా కూడా పేకాట రాయుళ్లను దుబాయ్ కి తరలిస్తున్న విషయాలు బయటపడుతున్నాయి.గతంలో కూడా బిహార్ రాష్ట్రానికి చెందిన 6 మంది ఎమ్మెల్యేలు పట్టుబడిన విషయం విధితమే.ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు లీలలు ఒక్కొక్కటిగా బయటి వస్తున్నాయి…

చీకోటి ప్రవీణ్ దందాలో అనేక మంది రాజకీయ నాయకులు తెరవెనుక ఉండి సమస్తం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో చీకోటి పెద్ద ఎత్తున హవాలా వ్యాపారం నిర్వహించడానికి అధికార పార్టీకి చెందిన పాలకుల మనిషిగా చెప్పుకునే రాజకీయ నేత అండదండలతో నిర్విరామంగా సాగించినట్లు ప్రచారం సాగుతోంది.ఆ రాజకీయ నేత భరోసాతో దాదాపు 200 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకుని వీటి ద్వారా హవాలా డబ్బును దుబాయ్ కి తరలించి అక్కడి నుంచి ఇక్కడికి వందల కోట్లను తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
దుబాయ్ కి సముద్రమార్గాన హవాల డబ్బులను తరలించడం వల్ల వీరి బాగోతం ఇప్పటి వరకు బయటపడలేదు.
తాజాగా ఈడీ దాడులతో నేతలంగా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.వేల కోట్ల చీకటి దందా నడుపుతున్నప్పటికీ ఇప్పటి వరకు కొంత మొత్తంలో నగదు లభించినట్లు అధికారులు చెప్పారు.
ట్రై కలర్స్… అనే ఓ షెల్ కంపెనీలో జరిగిన సోదాల్లో ఆ నగదు లభించినట్లు సమాచారం.ఇంకా ఈడీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా ట్రై కలర్స్ అనే కంపెనీపై ఈడీ దాడులు కొసాగుతున్నాయి.







