కోనసీమ వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన...

కోనసీమలోని గోదావరి వరదల వల్ల నష్టపోయిన లంక గ్రామాల ప్రజలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు.ఈరోజు ఉదయం తాడేపల్లి నుంచి నేరుగా గంటి పెదపూడి కి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ముఖ్యమంత్రి వశిష్ట గోదావరి నదిలో లాంచీ లో ప్రయాణం చేశారు.

 Chief Minister's Visit To Konaseema Flood Areas , Chief Minister , Konaseema Fl-TeluguStop.com

అనంతరం ట్రాక్టర్ పై ఎక్కి పి గన్నవరం మండలంలోని పుచ్చకాయల వారి పేట, ఉడిముడి లంక, బూరుగులంక, అరిగిల వారి పేట, ప్రాంతాల్లో పర్యటించారు.కొన్ని ప్రాంతాల్లో కాళీ నడకన బాధితులు వద్దకు వెళ్లి వరదల్లో ప్రభుత్వ సహాయక చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు.

శిబిరాల్లో బాగా చూసుకున్నారా అని వరద బాధితులు ప్రశ్నించారు.జిల్లా కలెక్టర్కు ఎన్ని మార్కులు వేయవచ్చు అని వరద బాధితులను ముఖ్యమంత్రి అడిగారు.

ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతంలో వాలంటీర్లు బాగా చూసుకున్నారని వరద బాధితులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పారు.ఒకపక్క వాతావరణం అనుకూలించక పోయిన మరో పక్క వర్షం పడుతున్న కొనసీమ లంక గ్రామాల్లో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube