మొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ ,నేడు మరో సీనియర్ నేత పి.చిదంబరం ఇలా ఒక్కొక్కరు సీనియర్ నేతలు పార్టీ అధిష్టానం పై చురకలు అంటిస్తున్నారు.
ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యం పై ఒకరి తరువాత మరొకరు సీనియర్ నేతలు పార్టీ పై కస్సు బుస్సులాడుతున్నారు.సీనియర్ నేత కపిల్ సిబాల్ వ్యాఖ్యల తర్వాత మరో సీనియర్ నేత పి.చిదంబరం కూడా వైఫల్యంపై పెదవి విరిచి పార్టీ పై గుస్సు మన్నారు.ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికలతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ, కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలపై కూడా తీవ్ర ఆందోళన చెందినట్లు ఆయన తెలిపారు.
ఆయన మాట్లాడుతూ….గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ, కర్నాటకలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా ఆందోళన చెందా.ఈ ఫలితాలను చూస్తుంటే క్షేత్ర స్థాయిలో పార్టీ ఉనికిని కోల్పోతోందని అర్థమవుతోంది అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా క్రమక్రమంగా పార్టీ ఢీలా పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
అత్యంత చిన్న పార్టీలైన సీపీఐ-ఎంఎల్, ఎంఐఎం లాంటి పార్టీలు క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్నాయి కాబట్టే విజయం సాధించాయన్న ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి గెలిచే ఛాన్స్ ఉన్నప్పటికీ ఎందుకు ఓడిపోయామన్న దానిపై లోతైన సమీక్ష అవసరం అని అన్నారు.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ లలో కాంగ్రెస్ విజయం సాధించి ఎన్నో రోజులు కూడా గడవలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని ఈ సందర్భంగా చిదంబరం వ్యాఖ్యలు చేసారు.గత కొంత కాలంగా పార్టీ సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై గుస్సు మంటున్న విషయం తెలిసిందే.ఆ పార్టీ సీనియర్ నేతలు అందరూ కూడా పార్టీ బలోపేతం కోసం అధిష్టానం లో మార్పులు రావాలి అంటూ సూచించారు.
అయితే వారి వ్యాఖ్యలపై పలువురు నేతలు మండిపడుతున్నారు.