కేవలం రూ.30కే చికెన్ బిర్యానీ.. ఆ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ప్రస్తుతం సోషల్ మీడియాలో 2001 నాటి రెస్టారెంట్ మెనూ హల్‌చల్ చేస్తోంది.ఈ మెనూ ఫొటో నెటిజన్లను 20 ఏళ్ల వెనక్కి తీసుకువెళుతోంది.

 Chicken Biryani Rs 30- Menu Card From 2001 Goes Viral,chicken Biryani, Mutton Bi-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే ఈ మెనూలోని ఆహార పదార్థాల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి.ఈ మెనూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొద్ది గంటల క్రితమే షేర్ కాగా దీనికి ఇప్పటికే 3500కి పైగా లైక్‌లు వచ్చాయి.

Telugu Restaurant Menu, Cheap, Chicken Biryani, Mutton Biryani-Latest News - Tel

నేటి కాలంలో ప్రజలు రెస్టారెంట్ మెనూలో తక్కువ ధర కలిగిన వంటకం కోసం చాలా సేపు వెతుక్కుంటున్నారు.ఎందుకంటే ధరలు భరించలేనంతగా పెరిగిపోయాయి.అయితే 2001 మెనూలో మాత్రం అన్నీ చాలా తక్కువ ధరకే దొరుకుతున్నట్లు కనిపిస్తున్నాయి.ఇందులో అత్యధిక ధర కలిగిన వంటకం ఏదో తెలుసుకోవడానికి చాలా సేపు వెతకాల్సి వస్తుంది.

ఎందుకంటే ప్రతిదీ ఇందులో తక్కువ ధరనే ఉంది.ఉదాహరణకు, చికెన్ బిర్యానీ కేవలం రూ.30, మటన్ బిర్యానీ రూ.32 ఉంది.అయితే, ఇప్పుడు చికెన్ బిర్యానీ ధర సుమారు రూ.200, మటన్ బిర్యానీ ధర సుమారు రూ.300 వరకు పలుకుతున్నాయి.

Telugu Restaurant Menu, Cheap, Chicken Biryani, Mutton Biryani-Latest News - Tel

ఇక ఈ 20 ఏళ్లలో బాగా ధర పెరిగిన మరో వస్తువు పనీర్ బటర్ మసాలా అని చెప్పవచ్చు.22 ఏళ్ల క్రితం ఇది కేవలం రూ.24 మాత్రమే.ఇక మెనూలో ఎగ్ రోల్, చికెన్ రోల్, స్పెషల్ చికెన్ రోల్ వంటి రోల్ ఐటమ్స్ రూ.7 నుంచి రూ.24 ధరల రేంజ్ లో మాత్రమే ఉండటం గమనార్హం.నెటిజన్లు 2001 మెనూని ప్రస్తుత ధరలతో పోల్చి తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.2001 నాటి ఈ మెనూ, సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం కారణంగా ఆహార పదార్థాల ఎంత ధరలు పెరిగాయో గుర్తుచేస్తుంది.ఇకపోతే ఇటీవల స్వాతంత్ర్యం సమయంలో పాకిస్థాన్ నుంచి భారతదేశానికి 9 మందికి టిక్కెట్టు ధర రూ.36, 9 అణాలు మాత్రమే ఉన్నట్లు తెలిపే ఒక బిల్లు కూడా వైరల్ అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube