టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో కళ్యాణి ఒకరనే సంగతి తెలిసిందే.కళ్యాణి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.
అభినయ ప్రధాన పాత్రల్లోనే ఎక్కువగా నటించిన కళ్యాణి ఈ సినిమాల ద్వారా పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నారు.కళ్యాణి భర్త సూర్య కిరణ్ సత్యం, రాజుభాయ్ సినిమాలకు దర్శకత్వం వహించగా ఈ సినిమాలు సక్సెస్ సాధించాయి.
అయితే ఆ తర్వాత సూర్య కిరణ్ దర్శకత్వం వహించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం గమనార్హం.సూర్యకిరణ్, కళ్యాణి విడిపోయారనే సంగతి తెలిసిందే.
అయితే వీళ్లిద్దరూ ఎందుకు విడిపోయారనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానాలు మాత్రం ఎవరికీ తెలియవు.ప్రముఖు నటుడు చేతన్ చీను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకవైపు హీరోగా చేస్తూనే తాను ప్రొడక్షన్ పనులు కూడా చూసుకున్నానని తెలిపారు.
కళ్యాణి అక్క వాళ్లు ఛాప్టర్6 సినిమాతో భారీ మొత్తంలో నష్టపోయారని చేతన్ చీను చెప్పుకొచ్చారు. చాప్టర్6 అడ్వాన్స్డ్ స్క్రిప్ట్ అని అందరికీ టేక్ ఆఫ్ అవ్వలేదని ఆయన తెలిపారు.
ఒక కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వగా అతను చెప్పిన కథకు తీసిన కథకు పొంతన లేకుండా పోయిందని ఆయన చెప్పుకొచ్చారు.అక్క, నేను మెంటల్ స్ట్రెస్ తీసుకుని ప్రాజెక్ట్ పూర్తి చేశామని తెలిపారు.

మంచి లేట్ గా రీచ్ అవుతుందని చెడు వేగంగా రీచ్ అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.కళ్యాణి, సూర్యకిరణ్ స్ట్రగుల్ సమయంలో నేను ఉన్నానని చేతన్ చీను తెలిపారు.వాళ్లు తీసుకున్న డెసిషన్ కు రెస్పెక్ట్ ఇస్తానని చేతన్ చీను అన్నారు.ఒకటి జరగడానికి ముందు వాళ్లు ఎన్నో ఆలోచించి ఉంటారని చేతన్ చీను చెప్పుకొచ్చారు.వాళ్లను కామెంట్ చేయడానికి మనమెవరమని చేతన్ చీను అన్నారు.ఛాప్టర్6 సినిమా వల్లే కళ్యాణి, సూర్య కిరణ్ విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చేతన్ చీను అన్నారు.చిన్నచిన్న డిస్టర్బెన్స్ లు జరగడంతో వాళ్లు విడిపోవాల్సి వచ్చిందని చేతన్ చీను అన్నారు.







